Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
స్పెసీ చికెన్ బర్త...పాపులర్ సైడ్ డిష్
చికెన్ బర్త ఒక పాపులర్ సైడ్ డిష్. దీన్ని ఎక్కువగా ప్లెయిన్ రైస్, రోటిస్ కి మంచి కాంబినేషన్. ఈ నాన్ వెజిటేరియన్ రిసిపిని చికెన్ మరియు ఇండియన్ మసాలాలతో తయారు చేస్తారు. ఇతర నాన్ వెజిటేరియన్ వంటకాలతో పోల్చితే ఈ వంట మరింత స్పైసీగా ఉంటుంది. ఈ నాన్ వెజిటేరియన్ వంటకాన్ని కొంచెం వెరైటీగా తయారు చేస్తారు. చికెన్ బాగా మెత్తగా చిదిమి తర్వాత మసాలాలు, ఉల్లిపాయలతోటి వండుతారు. మరి ఈ వంటను ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్: 1/2kg(స్కిన్ లెస్ చికెన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి, మెత్తగా చిదిమి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 4(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 6-8(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
పసుపు: 1/2tsp
కారం: 1tsp
గరం మసాలా: 1tsp
మెంతి: 1tsp
జీలకర్ర: 1tsp
టమోటో కెచప్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, వేడయిన తర్వాత అందులో జీలకర్ర వేసి చిటపటలాడాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
2. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించాలి.
3. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, తర్వాత టమోటో వేసి మెత్తబడే వరకూ వేయించాలి.
4. తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేయించిన పదార్థాలన్ని చల్లబర్చాలి, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో మరికొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి తర్వాత పసుపు, కొద్దిగా ఉప్పు చల్లాలి. ఐదు నిముషాలు పాటు వేయించి తర్వాత అందులో చిదిమి పెట్టుకొన్న చికెన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ బాగా వేయించాలి.
6. తర్వాత అందులోనే ఉల్లిపాయ టమోటో పేస్ట్ కూడా వేసి నీరంత ఇమిరిపోయే వరకూ వేయించాలి. తర్వాత గరం మాసాలా, కారం, మేతి, టమోటో కెచప్ వేసి బాగా కలియబెట్టాలి. దీన్ని తక్కువ మంట మీద బాగా ఉడికించాలి. అంతే చికెన్ బర్త రెడీ. కొత్తమీర తరుగుతో గార్నిష్ చేసి ఉల్లిపాయ ముక్కలతో రైస్, రోటీతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











