Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్పైసీ కోరియాండర్ ఫిష్ : సీఫుడ్ స్పెషల్
ఫిష్(చేపలు) చాలా ప్రసిద్ధి చెందిన ఒక హెల్తీ సీఫుడ్. తీరప్రాంతాల్లో ఫిష్ లేకుండా వారి భోజనాలు అసంపూర్ణం. తీర ప్రాంతాల్లో అనేక ఫిష్ వెరైటీ వంటను తయారుచేస్తారు.
తీర ప్రాంతాల్లో చేపలతో వివిధ రకాలుగా వంటలు వండుతారు. అటువంటి ప్రదేశంలోని డాబా లేదా రెస్టారెంట్స్ ను వెళ్ళినప్పుడు, మీరు ఏ ఫిష్ కర్రీని వదిలిపెట్టకుండా అన్ని రుచిచూసేస్తారు. ఈ స్పైసీ ఫిష్ కర్రీని రైస్ లేదా రోటీలతో సర్వ్ చేస్తారు. మీరు ఈ స్పైసీ కొత్తిమీర ఫిష్ ను నిమ్మతో తయారుచేయాలనుకుంటే ఈ క్రింది పద్దతిని అనుసరించాల్సిందే...

కావల్సిన పదార్థాలు:
సాల్మన్ ఫిష్ ఫిల్లెట్: 1can
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం: 1 అంగుళం (పేస్ట్ చేసుకోవాలి
వెల్లుల్లి: 4-5రెబ్బలు
కొత్తిమీర తరుగు: గుప్పెడు(శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 4
పసుపు: 1tsp
కారం: 1 1/2 tsp
ధనియాల ధనియాలపొడి: 1 tsp
ఆవాలు: ½ tsp
మెంతులు: ½tsp
నిమ్మరసం: 2tbsp
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: ½ cup
తయారుచేయు విధానం:
1. ముందుగా ఓవెన్ ను 300డిగ్రీలకు పెట్టాలి.
2. తర్వాత ఫిష్ ఫిల్లెట్ ను శుభ్రంగా కడిగి, బాగా తడి ఆరనివ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఫిష్ ఫిల్లెట్ మరియు ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఆవాలు మరియు మెంతులు వేసి కొద్దిగా నీరు చేర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. తర్వాత అదే పేస్ట్ లో నిమ్మరసం, పసుపు, కారం, పచ్చిమిర్చి, మరియు ధనియాలు వేసి మరో సారి పేస్ట్ చేసుకోవాలి.
5. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ పెట్టి, అందులో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మరో నిముషం వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డె బ్రైన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకొన్ని మసాలా వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించాలా తర్వాత అందులో టమోటో ముక్కలను కూడా వేసి, వేగిస్తూ, ఉప్పు మరియు గరం మసాలా చేర్చి వేయించుకోవాలి. మసాలా నుండి నీరు మొత్తం ఇమిరిపోయే వరకూ అతి తక్కువ మంట మీద వేయించుకోవాలి. మసాలా వేగిని తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి.
7. తర్వాత మరో ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ఫిష్ ఫిల్లెట్ వేసి నూనెలో మీడియం మంట మీదా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
8. ఇప్పుడు బేకింగ్ డిష్ కు కొద్దిగా నూనె అప్లై చేసి, వేయించుకొన్న చేపముక్కలకు, ముందుగా వేయించి పెట్టుకొన్న మసాలాను చేపముక్కలకు పట్టించి, బేకింగ్ డిష్ లో విడివిడిగా సర్ధి పెట్టుకోవాలి. ఒక వేళ మసాలా మిగిలితే దాన్ని కూడా చేపలమీద వేసేసుకోవాలి.
9. ఇప్పుడు డిష్ ను ఫోయిల్ తో మూత కవర్ చేసి 25నిముషాలు బేక్ చేయాలి. అవి బేక్ అయిన తర్వాత వాటిని బయటకు తీయాలి. అంతే కోరియాండర్ అండ్ లెమన్ ఫిష్ రెడీ . కొత్తమీర ఆకులు మరియు కొత్తిమీర చట్నీతో గార్నిష్ చేయండి. ఈ స్పెషల్ డిష్ ను రైస్ రోటీలతో సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications