Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
స్పైసీ హైదరాబాది చికెన్ - 65

కావలసిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్: 1/2kg
గుడ్డు: 1
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
కారం: 1tsp
ఫుడ్ కలర్(కేసరి కలర్): చిటికెడు
కార్న్ ఫ్లోర్(మొక్కజొన్నపిండి): 2tbsp
పచ్చిమిర్చి: 8-10
కరివేపాకు: రెండు రెమ్మలు
అల్లం తురుము: 1tbsp
గట్టి పెరుగు: 2cup
అజినామాటో: చిటికెడు
బ్లాక్ పెప్పర్ (మిరియాల)పౌడర్: 1/2tsp
కొత్తిమీర తరుగు: కొద్దిగా
నూనె: వేగించడానికి సరిపడా
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్, ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్, గుడ్డు, శుభ్రం చేసిపెట్టుకొన్న చికెన్ వేసి అన్నీ బాగా మిక్స్ చేసి ఒక గంటపాటు పక్కన పెట్టేసుకోవాలి.
2. ఒక గంట తర్వాత లోతుగా వున్న కడాయి లేదా పాన్ తీసుకొని అందులో తగినంత నూనె వేయాలి.
3. స్టౌ మీద పెట్టి ఆయిల్ వేడి అయ్యాక మారినేట్ (కలిపి) పెట్టుకొన్ని చికెన్ ముక్కలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ డీప్ ప్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి.
4. తర్వాత మరో చిన్నపాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనెవేసి వేడయ్యాక అందులో అల్లం తురుము వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.
5. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి.
6. ఇప్పుడు అందులో పెరుగు కూడా వేసి మిక్స్ చేసి మరో రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి. పెరుగు వేడికి బుడగలు వచ్చే సమయం చూసి ఉప్పు, అజినామోటో, ఫుడ్ కలర్ మరియు ఫ్రైడ్ చికెన్ ముక్కలు వేసి మంట ఎక్కువగా పెట్టి బాగా మిక్స్ చేయాలి.
7. చికెన్ ముక్కలు ఒక్కసారిగా పెరుగు మిశ్రమంతో కలిసిపోయి గట్టి పడే సమయంలో పెప్పర్ పౌడర్ చల్లి బాగా మిక్స్ చేయాలి.
8. ఇప్పుడు చికెన్ ముక్కలు చెదిరిపోకుండా మీడియం మంట మీద సున్నితంగా కలియబెడుతూ ఉడకనివ్వాలి. చికెన్ ముక్కలు పెరుగుమిశ్రమంలో బాగా ఫ్రై అయ్యి పొడిపొడి గా తయారయ్యేంత వరకూ వేయించాలి.
9. చివరగా కొత్తిమీర తరుగును చల్లి గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే హైదరాబాదీ చికెన్ 65 రెడీ.



Click it and Unblock the Notifications