Latest Updates
-
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ తప్పులు చేస్తే ప్రమాదమే! -
రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? డయాబెటిస్, ఫ్యాటీ లివర్ ఉన్నవారు రాత్రి 9:30 తర్వాత తింటే ఏమవుతుంది? -
గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం..అదృష్టం మీ వెంటే! -
సర్వార్థ సిద్ధి యోగం.. ఈరోజు ఈ రాశుల వారికి ఊహించని ధన లాభం! -
అన్నం మిగిలిపోయిందా? వృధా చేయకుండా ఇలా కరకరలాడే పకోడీలు చేసేయండి -
హనుమాన్ దీక్షా విరమణకు సిద్ధమా? మే 12న ఆలయాల్లో రద్దీని తట్టుకుని దర్శనం చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
శని సంచారం: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ రాశి ఉందేమో చూసుకోండి! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - శనివారం, 09 మే 2026 -
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు!
స్పైసీ రెడ్ చిల్లీ ఫిష్ ఫ్రై

చేపముక్కలు: 1/2kg
కారం: 1tsp
గరం మసాలా: 1tsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
ఫుడ్ కలర్: చిటికెడు
కార్న్ (మొక్కజొన్న)పౌడర్: 2tbsp
మైదా: 1tsp
గుడ్డు: 1
పచ్చిమిర్చి: 8(పొడవుగా కట్ చేసుకొన్నవి)
కరివేపాకు : రెండు రెమ్మలు
నిమ్మరసం: 3tsp
అల్లం, వెల్లుల్లి చిన్న ముక్కలు లేదా తురుము: 1tsp
ఉప్పు రుచికి సరిపడా
నూనె: వేగించడానికి తగినంత
1. ముందుగా చేప ముక్కలు పసుపు, ఉప్పు వేసి బాగా శుభ్రం చేసి తర్వాత ఒక శుభ్రమైన పొడి వస్త్రంతో చేపముక్కలను తుడిచి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎరుపు మిరపకాయల పొడి, గరం మసాలా, ఉప్పు, మరియు ఎరుపు రంగు(ఫుడ్)కలర్ కలిపి 20 నిమిషాలు పాటు పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అందులో మొక్కజొన్న పిండి, మైదా పిండి మరియు పగులకొట్టిన గుడ్డు ను పైన పదార్థాలు జోడించి, బాగా కలపాలి.
4. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి లైట్ గా వేయించి ఒక ప్లేట్ లోనికి తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పై మసాలా మిశ్రమాన్ని చల్లారిన చేపముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
5. అరగంట తర్వాత పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత అందులో వేయించి మసాలలో నానబెట్టుకొన్న చేపముక్కలను కూడా వేసి మరి కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
6. ఫైనల్ గా వేయించిన చేపముక్కలకు తరిగిన కొత్తిమీర, నిమ్మరసంతో గార్నిష్ చేసి వేడి వేడి గా రెడ్ చిల్లీ ఫిష్ ను సర్వ్ చేయాలి. అంతే రెడ్ చిల్లీ ఫిష్ ఫ్రై రెడీ...



Click it and Unblock the Notifications