Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
అన్నం మిగిలిపోయిందా? వృధా చేయకుండా ఇలా కరకరలాడే పకోడీలు చేసేయండి
మన ఇళ్లలో తరచుగా అన్నం మిగిలిపోవడం చాలా సహజం. ఆ అన్నాన్ని పారేయడానికి మనసు రాదు, అలాగని మళ్లీ వేడి చేసుకుని తినడానికి అంతగా ఇష్టపడము. మరి ఆ అన్నాన్ని వృధా చేయకుండా, ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తినేలా ఒక అద్భుతమైన స్నాక్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? మిగిలిపోయిన అన్నంతో కరకరలాడే, నోరూరించే పకోడీ తయారు చేయవచ్చు. వేడి వేడి టీ తాగుతూ ఈ పకోడాలను తింటే ఆ మజాయే వేరు. ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతో కేవలం 15-20 నిమిషాల్లో మిగిలిపోయిన అన్నంతో టేస్టీ పకోడీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మిగిలిన అన్నంతో పకోడీ తయారీకి కావలసిన పదార్థాలు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - 2
వండిన అన్నం - ఒక కప్పు
వంట నూనె - డీప్ ఫ్రై చేయడానికి
కొత్తిమీర తరుగు -పావు కప్పు
కసూరి మెంతి - ఒక టేబుల్ స్పూన్
పసుపు - పావు టీస్పూన్
కారం - ఒక టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
శనగపిండి - అర కప్పు

మిగిలిన అన్నంతో పకోడీ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ గిన్నె తీసుకుని, అందులో మిగిలిపోయిన అన్నాన్ని వేయండి. అన్నం ముద్దలుగా ఉంటే చేతితో కొద్దిగా మెదుపుకోండి. ఇప్పుడు అందులో సన్నగా, పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఫ్రెష్ కొత్తిమీర తురుము వేసి బాగా కలపండి.
-తర్వాత ఆ మిశ్రమంలో మంచి సువాసన కోసం ఒక టేబుల్ స్పూన్ కసూరి మెంతిని చేతితో నలిపి వేయండి. ఆ వెంటనే పసుపు, కారం, మీ రుచికి తగినంత ఉప్పు వేయండి. పకోడాలకు పర్ఫెక్ట్ బైండింగ్ ఇవ్వడానికి అర కప్పు శనగపిండిని కూడా వేసి ఈ పదార్థాలన్నీ ఒకదానికొకటి పట్టేలా బాగా కలుపుకోవాలి. అవసరమైతే 2- 4 చెంచాల నీళ్లు మాత్రమే చల్లి, పిండిని పకోడాలు వేయడానికి వీలుగా గట్టిగా కలుపుకోండి. అన్నంలో ఇప్పటికే తేమ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీరు పట్టదు, చూసుకుని కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి ఒక కడాయిని వేడి చేయండి. నూనె బాగా కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడాలుగా తీసుకుని జాగ్రత్తగా నూనెలో వేయండి.
-పకోడీలను వెంటనే గరిటెతో కదపకుండా, ఒక నిమిషం పాటు వేగనివ్వండి. ఆ తర్వాత మంటను మీడియంలో ఉంచి, అటూ ఇటూ తిప్పుతూ, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కరకరలాడేలా వేయించుకోండి. వేగిన పకోడీలను ఒక ప్లేట్ లో నాప్ కిన్ లేదా టిష్యూ పేపర్ పరిచి, దానిపైకి తీసుకోండి. దీనివల్ల అదనపు నూనె పీల్చుకోబడుతుంది.
-అంతే ఎంతో రుచికరమైన, వేడి వేడి పకోడీలు రెడీ. ఈ వేడి వేడి పకోడీలను టమాటో సాస్, పుదీనా చట్నీతో తింటే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
