Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? డయాబెటిస్, ఫ్యాటీ లివర్ ఉన్నవారు రాత్రి 9:30 తర్వాత తింటే ఏమవుతుంది?
ఉరుకులు పరుగుల జీవితం.. ఆఫీసు పనులు, మొబైల్ స్క్రోలింగ్, వెబ్ సిరీస్ ల మోజులో పడి రాత్రి భోజనాన్ని చాలా మంది అర్ధరాత్రి దాకా వాయిదా వేస్తుంటారు. ఏదో తూతూమంత్రంగా, చివరి నిమిషంలో కడుపులో రెండు ముద్దలు పడేసి పడుకోవడం నేడు సర్వసాధారణంగా మారిపోయింది. ఇది చిన్న విషయంగానే అనిపించినా, దీని వెనుక పెద్ద ప్రమాదమే పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు ఎయిమ్స్ లో శిక్షణ పొంది, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ సౌరభ్ సేథి. మనం ఏం తింటున్నాం అనే దానికంటే, ఏ సమయానికి తింటున్నాం అనేది మన ఆరోగ్యాన్ని ఎక్కువగా శాసిస్తుందని ఆయన చెబుతున్నారు.

ఆలస్యంగా తింటే శరీరంలో ఏం జరుగుతుంది?
మన శరీరం సర్కాడియన్ రిథమ్ అనే సహజమైన అంతర్గత జీవ గడియారం ఆధారంగా పనిచేస్తుంది. ఇది మన జీర్ణక్రియ, హార్మోన్ల ఉత్పత్తి, నిద్రను నియంత్రిస్తుంది. రాత్రి ఆలస్యంగా భోజనం చేసినప్పుడు, శరీరం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా జీర్ణక్రియ కోసం అదనంగా కష్టపడాల్సి వస్తుంది.
డాక్టర్ సేథి ప్రకారం దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఏకంగా 30 నుంచి 40 శాతం పడిపోతుంది. కొవ్వు కరిగే ప్రక్రియ తీవ్రంగా మందగిస్తుంది. అంతేకాకుండా నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతుంది. ఫలితంగా విశ్రాంతి తీసుకోవాల్సిన శరీరానికి, ఆహారాన్ని అరిగించే ప్రక్రియకు మధ్య పెద్ద సంఘర్షణ మొదలవుతుంది.
ఉదయం లేవగానే నీరసంగా ఎందుకుంటారో తెలుసా?
రోజుకు ఎనిమిది గంటలు పడుకున్నా ఉదయం లేవగానే ఉబ్బరంగా, నీరసంగా, అలసటగా అనిపిస్తోందా? దీనికి ప్రధాన కారణం మీ లేట్ నైట్ డిన్నరే. పడుకునే ముందు తినడం వల్ల జీర్ణ సామర్థ్యం తగ్గిపోతుంది.
నిద్రపోయే సమయంలో శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడం, మలినాలను తొలగించడం లాంటి పనులను పక్కనపెట్టి, ఆహారాన్ని అరిగించే పనికే ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఉదయం నిద్రలేచే సరికి మీలో శక్తి నశించి, అలసటగా ఫీల్ అవుతారు.
రాత్రి భోజనం పెందలకడనే ఎందుకు ముగించాలి?
మనం తీసుకునే క్యాలరీల లెక్కలు మార్చకపోయినా కేవలం సాయంత్రం 7 గంటల లోపు భోజనం ముగించడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత మెలటోనిన్ పెరగడం వల్ల, గ్లూకోజ్‌ను కరిగించే సామర్థ్యం శరీరానికి తగ్గుతుంది. అందుకే రాత్రి 7 గంటలకు తింటే హార్మోన్లు సమతుల్యంగా ఉండి, నిద్ర చక్కగా పడుతుంది.
రాత్రిపూట రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ 15 శాతం వరకు తగ్గుతాయి. అదే రాత్రి 9:30 తర్వాత తింటే కొవ్వు పేరుకుపోవడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. భోజన సమయాన్ని కేవలం 2-3 గంటలు ముందుకు జరపడం వల్ల శరీరానికి రికవరీ అయ్యే సమయం దొరుకుతుంది.
డయాబెటిస్, ఫ్యాటీ లివర్ ఉన్నవారికి..
టైప్ 2 డయాబెటిస్, ప్రీ డయాబెటిస్, ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నవారికి ఆలస్యంగా భోజనం చేయడం మరింత ప్రమాదకరం. ఇలాంటి వారిలో లేట్ డిన్నర్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏకంగా 30 నుంచి 50 శాతం వరకు పెరిగిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ సేథి హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది వ్యాధిని అదుపు చేయడం కష్టతరం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications