Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్పైసీ థాయ్ చికెన్ విత్ బాసిల్ హాట్ అండ్ స్పైసీ
థాయ్ ఫుడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే మన ఇండియాలో అంత పాపులర్ అయ్యాయి. ఈ వంటలు చాలా స్పైసీగా మరియు గొప్ప రుచిని కలిగి ఉంటాయి . సాధారణంగా థాయ్ ఫుడ్స్ కు చాలా సింపుల్ వస్తువులను మరియు హెర్బ్స్ ను ఉపయోగిస్తుంటారు. అందుకు చాలా టేస్టీగా ఉంటాయి. అటువంటి టేస్ట్ ఆహారాల్లో ఈ థాయ్ చికెన్ బాసిల్ రిసిపి ఒకటి.
ఈ చలికాలంలో బయట చలి ఎక్కువగా ఉన్నప్పుడు సైసీగా వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇటువంటి థాయ్ రిసిపిలు ఉత్తమ ఎంపిక. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, వాళ్లకు రంగులు మాత్రమే కాదు. రుచికరమైన కూరలు. రుచి మాత్రమే కాదు. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న కూరలు. ఈ తరహా కూరలకు థాయ్‌లాండ్ ప్రసిద్ధి. వీటిని చేయటానికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ల కూరల్లో వెజ్, నాన్‌వెజ్ రెండూ ఉన్నాయి.

ఈ స్పెషల్ థాయ్ చికెన్ బాసిల్ రిసిపి మన ఇండియన్ స్టైల్లో ఇంట్లో తయారుచేయాలో తెలుసుకుందాం...
Serves: 2
Preparation time: 10 minutes
Cooking time: 30 minutes

కావల్సిన పదార్థాలు:
చికెన్ బ్రెస్ట్ : (బోన్ లెస్/చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
తాజా తులసి ఆకులు: 1/2cup
తాజా ఎండు మిర్చి: 3(మద్యకు కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి: 2tbsp(కట్ చేసుకోవాలి)
ఫిష్ సాస్: 1tbsp
సోయా సాస్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: 1tsp
నూనె: 4tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి , ఫిష్ సాస్ తో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత వోక్ లేదా పాన్ లో రెండు చెంచాలా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో కట్ చేసిన వెల్లుల్లి వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేయాలి.
4. మరో పాన్ లో, మరో రెండు చెంచాల నూనె వేసి బాసిల్ లీవ్స్(తులసి ఆకుల)ను వేసి క్రిస్పీగా అయ్యే వరకూ వేగించుకొని పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత వేగుతున్న చికెన్ లో రెడ్ చిల్లీ, సోయా సాస్, ఉప్పు మరియు పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి.
6. ఫ్రై చేస్తూనే అందులో వేగించి పెట్టుకొన్న తులసి ఆకులను వేసి మొత్తం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
7. చికెన్ మెత్తగా ఉడికే వరకూ ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి.
8. చికెన్ ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి. అంతే స్పైష్ థాయ్ చికెన్ బాసిల్ రెడీ. ఫ్రైడ్ రైస్ కు సైడ్ డిష్ గాను లేదా ఆప్టిటైజర్ గాను సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications