Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
స్టఫ్డ్ ఖీమా పరాట-రంజాన్ స్పెషల్ రిసిపి
ఖీమా పరోటా మటన్ ను చాలా చిన్నచిన్న ముక్కలుగా(ఒక్కమాటలో చెప్పాలంటే పొడిపొడిగా)తయారు చేసి రెడీ చేసే ఆథెంటిక్ ఇండియన్ బ్రెడ్. నిజానికి ఈ డిష్ ను రాయల్ మొగలాయి వంటకాల నుండి తీసుకోబడింది. ఈ రాయల్ రిసిపిని సైడ్ డిష్ లా సర్వ్ చేస్తారు. వారి నుండి వచ్చని ఒరిజినల్ రిసిపికి కొన్ని మార్పులు చేర్పులతో తయారు చేసినదే ఈ స్టఫ్డ్ ఖీమా పరోటా రిసిపి.
ఈ రంజాన్ నెలలో స్టఫ్డ్ ఖీమా పరోటాను ప్రయత్నించవచ్చు. ఇది చాలా రుచికరంగా, కపుడు నింపే ఆహారంగానే కాకుండా పూర్తి పోషకాలతో నిండి ఉంటుంది. ఖీమాను మొదట పెరుగుతో మ్యారినేట్ చేసి, తర్వాత కొన్ని మసాలాలతో తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని చపాతీలలో నింపి, పరోటాలాగా తయారు చేస్తారు. ఈ పరోటాలు, రంజాన్ నెలలో ఉపవాసం ఉండేవారికి కావల్సిన శక్తిని అందిస్తుంది. మరి స్టఫ్డ్ ఖీమా పరోటా ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం...

మటన్ ఖీమా(చిన్నచిన్నముక్కలుగా చేసినది): 500gms
పెరుగు: ½cup
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tsp
పచ్చిమిరపకాయలు: 2(చిన్న ముక్కలుగా తరిగి)
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: 1tsp
కారం: ½tsp
జీలకర్ర పొడి: 1tsp
కొత్తిమీర పొడి: 2tsp
గరం మసాలా పొడి: 1tsp
నీరు: ½cup
ఆయిల్: 1tbsp
పరోటా కోసం:
గోధుమ పిండి: 2cups
ఉప్పు: కొద్దిగా
గోరువెచ్చని నీళ్ళు: 1/2cup
నూనె: 3tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక గిన్నెలో పెరుగు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి అందులో, మటన్ ఖీమా వేసి అన్నింటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. అరగంట తర్వాత పాన్ లో నూనె వేసి అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ఖీమాను కూడా వేగుతున్న మసాల మిశ్రమంలో వేసి, 10నిముషాలు పాటు వేగించాలి.
5. తర్వాత అందులోనే గరం మసాలా పౌడర్, నీళ్ళు పోసి మూత పెట్టి, 20నిముషాల పాటు, మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మద్య మద్యలో మూత తీసి కలియబెడుతుండాలి.
6. ఖీమా బాగా మెత్తగా ఉడికిన తర్వాత, స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి.
7. తర్వాత పరోటో కోసం సిద్దంగా పెట్టుకొన్న పదార్థాలన్నింటి, ఒక గిన్నెలో వేసి పిండిని మృదువుగా కలిపి పెట్టుకోవాలి.
8. తర్వాత పిండి నుండి కొంత భాగం తీసుకొని ఉండలు చుట్టుకోవాలి, తర్వాత వీటిని చపాతీ కర్రతో చపాతీల చుట్టుకోవాలి. తర్వాత చపాతీ మద్యలో ఖీమా మిశ్రమాన్ని ఒకటి లేదా రెండు టేబుల్స్ స్పూన్లు పెట్టి, తర్వాత నాలుగు వైపులా మడిచి, చేతి వేళ్ళుతో వత్తాలి. లోపలి మిశ్రమం బయటకు రాకుండా చూసుకోవాలి.
9. తర్వాత తిరిగి చపాతీలో నిదానంగా వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకొన్న తర్వాత పాన్ స్టౌ మీద పెట్టి వేడయ్యాక అందులో కొద్దిగా నూనె వేసి, కాలిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకొన్న ఖీమా చపాతీని పాన్ మీద వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ కాల్చుకోవాలి. ఈదే పద్దతిలో పరోటాలన్నింటిని తయారు చేసుకోవాలి.
అంతే ఖీమా పరోటా రెడీ. మీకు నచ్చిన కర్రీ లేదా రైతాతో తినవచ్చు.



Click it and Unblock the Notifications











