కూర్గ్ ఫ్రైడ్ చికెన్ - కర్ణాటక స్పెషల్ డిష్

కావలసిన పదార్థాలు:
చికెన్: 1/2kg
ఉల్లిపాయలు: 2(చిన్నముక్కలుగా కట్ చేసుకొన్నవి)
వెల్లుల్లి రెబ్బలు: 6-10
కాచమ్ పులి(కూర్గ్ వెనిగర్-కొద్దిగా పుల్లగా ఉంటుంది)-2tbsp(మార్కెట్లో దొరుకుతుంది)
కారం: 1tsp
ధనియాలు: 2tbsp
మిరియాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ఆవాలు: 1tsp
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 5-6
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: తగినంత

Coorg Fried Chicken

తయారు చేయు విధానం:
1. ముందుగా అన్ని మసాలా దినుసులు(ధనియాలు, ఆవాలు, మిరియాలు, లవంగాలు, చెక్క, జీలకర్ర అన్నీ మిక్సీలో వేసి వాటిని మెత్తని పౌడర్ లా గ్రైడ్ చేసుకోవాలి.
2. ఈ మసాలా దినుసులతో తయారు చేసే పౌడర్, కూర్గ్ స్పెషల్ గరం మసాలా అంటారు. వీటిని సాధారణంగా ఇంట్లోనే తయారు చేసుకొంటారు. లేదంటా బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది.
3. తర్వాత చికెన్ ను భాగా శుభ్రం చేసి ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకొని అందులో ముందుగా తయారు చేసుకొన్న కూర్గ్ గరం మసాలాను చికెన్ ముక్కలకు బాగా పట్టించి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
4. ఒక గంట తర్వాత పాన్ లో నూనె వేసి వేడిఅయ్యాకు అందులో ముందు చేసి పెట్టుకొన్నగరం మసాలాలో కొద్దిగా తీసుకొని అది వేడి నూనెలో వేసి అతి తక్కువ మంట పెట్టి వేయించుకోవాలి.
5. రెండు నిమిషాల తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు లేదా వెల్లుల్లి రెబ్బలను చితగొట్టుకొన్నవి వేసి రెండు మూడు నిమిషాల పాటు తక్కువ మంటలో వేయించుకోవాలి.
6. ఉల్లిపాయలు, వెల్లుల్లి బ్రౌన్ కలర్ లోకి మారే సమయంలో అందులో కారం వేసి బాగా మిక్స్ చేయాలి.
7. తర్వాత అందులోనే గరంమసాలాలో నానబెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి మీడియం మంటమీద పది నుండి పదిహేను నిమిషాల పాటు వేయించుకోవాలి. అవసరమైతే మూత పెట్టి ఆవిరిమీద ఉడికించుకోవచ్చు. లేదంటే మద్య మద్యలో కలియబెడుతుండాలి.
8. చివరగా వేగుతున్న చికెన్ కు వెనిగర్ చిలకరించి మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. అంతే కూర్గ్ ఫ్రైడ్ చికెన్ రెడీ. అంతే వీటికి ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చట్నీ లేదా గ్రీన్ సలాడ్ తో సర్వ్ చేసి, రుచి చూసి స్పెషల్ సండ్ డిష్ ను ఎంజాయ్ చేయండి....

Story first published: Saturday, August 18, 2012, 16:31 [IST]
Desktop Bottom Promotion