Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
టేస్టీ అండ్ హెల్తీ క్యాబేజ్ - ఎగ్ ఫ్రై
క్యాబేజ్ కూడా ఓ రకమైన పువ్వు జాతికి చెందినదే. విదేశాల నుండి భారతదేశానికి చేరింది. క్యాబేజ్ పువ్వులలో సి విటమిన్ పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన అన్ని రకాల లవణాలు ఉంటాయి. అందువలన ఖరీదు ఎక్కువ అయినప్పటికీ, నిర్లక్ష్యం చేయకుండా, కనీసం అప్పుడప్పుడైనా క్యాబేజ్ కూర రూపంలో గాని, మరొక విధంగా కానీ తీసుకోవటం మంచిది.
నిజానికి, కాలీఫ్లవర్ కన్నా విలువైన పోషకాలను కలిగి ఉన్నది క్యాబేజ్. విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలేట్ ఆరోగ్యదాయకమైన ఎన్నో పైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ నిరోధక కాయగూరలలో రారాజు. క్యాన్సర్‌ను నిరోధించే బయో ఫ్లావనాయిడ్స్ క్యాబేజ్లో పుష్కలంగా ఉంటాయి. పీచుపదార్థం ఎక్కువ. అందువలన మల విసర్జన సాఫీగా జరగటానికి, వ్యర్థ పదార్థాల బహిష్క రణకు దోహద పడుతుంది. వంధ్యత్వాన్ని పోగొడుతుంది. రేచీకటిని, చిన్న వయసులో జుట్టు తెల్లబడటాన్ని, ఊడిపోవడాన్ని నివారిస్తుంది.
క్యాబేజ్ లో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి9లు ఉన్నాయి. అంతేగాకుండా ప్రోటీన్లు, ఫాస్పరస్, పొటాషియంలు కూడా కలిగివుంది. అందుచేత వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాబేజ్ ను వంటకాల్లో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు. ఇలాంటి వంటల్లో క్యాబేజ్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావలసిన పదార్ధాలు
క్యాబేజ్(చిన్నసైజు): 1(సన్నగా కట్ చేసుకోవాలి)
గుడ్లు: 3
ఉల్లిపాయ: 2(సన్నగా ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
కారం: 4tsp
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: చిటికెడు
నూనె: సరిపడా
కొత్తిమీర: 1కట్ట
ఆవాలు: 1/2tsp
మినపప్పు: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
తయారు చేసే విధానం:
1. ముందుగా క్యాబేజ్ ను చిన్నగా కట్ చేసుకోవాలి. లేదా తురుము కోవాలి.
2. ఆ తర్వాత పోపు తాలింపు పెట్టి క్యాబేజ్ వేసి ఉప్పు, పసుపు, కారం వేసి నూనెలో బాగా మగ్గనివ్వాలి.
3. ఆ తర్వాత కొద్దిగా నీరు(చిన్న గ్లాసు) పోసి ఉడుకుతుండగా గుడ్లు కొట్టి వెయ్యాలి.
4. ఆతర్వాత బాగా నూనెలో వేయించి దించుకునే ముందు కొత్తిమీర వేసుకుని దించుకోవాలి. అంతే క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ.



Click it and Unblock the Notifications