Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
టేస్టీ మ్యాంగో చికెన్-సమ్మర్ స్పెషల్
ఈ కాలంలో అందరి కళ్లు మామిడి చెట్లమీదే. ఆకుల మధ్యన వేలాడే పచ్చి మామిడికాయలను చూడగానే ఎంతటివారికైనా నోట్లో నీళ్లు ఊరుతాయి. పుల్లటివైతే పప్పులో వేసుకుంటారు. కాస్త పులుపు తక్కువగా ఉంటే ప్లేట్లో ఉప్పు, కారం వేసుకుని లాగిచేస్తారు. కాయలు పళ్లయ్యేవరకూ ఆగడమంటే చాలా కష్టం. రెండు కాయలందుకుంటే గాని మనసు ఊరుకోదు. సి విటమిన్‌తో పాటు వేసవిలో ఒంటికి చలువ చేసే పచ్చిమామిడితో పప్పు, పులుసే కాకుండా బోలెడన్ని వెరైటీ వంటలు చేసుకోవచ్చు.
లేత మామిడికాయలు మార్కెట్లోకి వచ్చాక మరో కూరగాయ ఏదైనా వంటింట్లోకి రావాలంటే వెనకా ముందు చూసుకోవాల్సిందే! ఏ కూర వండినా మామిడికాయను జత చేస్తే కొత్త టేస్ట్‌తో ఇంటిల్లిపాది నోళ్లు ఊరాల్సిందే! వెజిటేరియన్ తో మాత్రమే కాదు నాన్ వెజిటేరియన్ తో నైస్ గా కలిసిపోయే ఈ పుల్ల పుల్లని మామిడికాయలతో జిల్ అనిపించేలా...ఫుల్ గా ఇంటిల్లి పాదికి అంధించండి.

కావలసిన పదర్థాలు:
చికెన్: 250grms
పుల్లని పచ్చి మామిడికాయలు: 2
నూనె: 1cup
ఉల్లిపాయలు: 2-3
పచ్చిమర్చి: 4-8
ధనియాలు: 1tsp
జీలకర్ర: 1tsp
గసగసాలు: 1tsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
కారం: 1/2tsp
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత మామిడికాయలను తొక్క తీసేసి బాగా తురుముకోవాలి.
3. తర్వాత పాన్ లో నూనె మరిగించాలి. ఇందులో కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసుకుని వేయించుకోవాలి.
4. తర్వాత చికెన్ ముక్కలు కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి. దీనికి మామిడి తురుము కలపాలి. పచ్చిమిర్చి తరుగు చేర్చుకోవాలి.
5. అంతలోపు జీలకర్ర, ధనియాలు, గసగసాలు కలిపి పొడిచేసుకోవాలి. దీన్ని పాన్ లోని మిశ్రమానికి చేర్చాలి. ఉప్పు, పసుపు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని తక్కువ మంట మీద కూరను పావుగంటపాటు ఉడికించాలి.



Click it and Unblock the Notifications