Latest Updates
-
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి!
టేస్టీ టేస్టీ కరాచి ఫిష్ కర్రీ
Non Veg
oi-Saraswathi
By Sindhu

చేపముక్కలు: 1kg
ఉల్లిపాయముక్కలు: 1cup(సన్నగా తరిగినవి)
అల్లంముక్కలు: 2tbsp(సన్నగా తరిగినవి)
చింతపండుపులుసు: 2tbsp
కొబ్బరిపాలు: 1cup
కొబ్బరికోరు: 1cup
ఎండుమిర్చి: 6-8
కారం: 3tbsp
నానబెట్టిన బియ్యం: 4tbsp
జీలకర్ర: 2tbsp
దనియాలు: 3tbsp
పసుపు: 1tbsp
నూనె: కావలసినంత
ఉప్పు: రుచికి తగినంత
వేయించిన మెంతిపిండి: 2tbsp
తయారుచేయు విధానం:
1. శుభ్రంగా కడిగిన చేపముక్కలకు ఉప్పు, కారం, పసుపు పట్టించి అరగంటసేపు పక్కన ఉంచాలి.
2. దనియాలు, జీలకర్ర దోరగా వేయించాలి. అందులోనే ఎండుమిర్చి, నానబెట్టిన బియ్యం, కొబ్బరికోరు కలిపి అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
3. ఓ బాణలిలో నూనె వేసి కాగాక అందులో ఉల్లిముక్కలు రెండు నిమిషాల తరవాత అల్లంముక్కలు వేసి దోరగా వేయించాలి.
4. తరవాత చేపముక్కలు వేసి అందులో నీరంతా ఇంకిపోయి నూనె తేలేంత వరకూ మీడియం మంటపైన ఉడికించాలి.
5. తరవాత గ్రైండ్ చేసి ఉంచిన మసాలా మిశ్రమం వేసి పది నిమిషాలపాటు వేగనివ్వాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసి 2 గ్లాసుల నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి.
6. కూర బాగా ఉడికి ముక్క గట్టిపడి గ్రేవీ చిక్కబడుతుండగా అందులో కొబ్బరిపాలు పోసి మూతపెట్టి మీడియం మంటమీద పది నిమిషాలు ఉడికించి చివరగా మెంతిపొడి వేసి దించాలి.
Comments
English summary
Tasty Tasty Karachi Fish Curry|టేస్టీ టేస్టీ కరాచి ఫిష్ కర్రీ|
Story first published: Wednesday, January 4, 2012, 17:37 [IST]
Other articles published on Jan 4, 2012



Click it and Unblock the Notifications