Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే!
అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా గత కొన్ని వారాలుగా పలు ఆసియా దేశాలతో పాటు మన దేశంలో కూడా ఆయిల్, గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. గ్యాస్ కొరత కారణంగా చాలా హోటల్స్ కూడా మూతపడ్డాయి. సామాన్యూలు కూడా బుక్ చేసిన గ్యాస్ రావడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో మే 1, 2026 నుంచి ఎల్పీజీ (LPG) వినియోగదారులకు సంబంధించి ఐదు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సామాన్యుల నుంచి సగటు గృహిణి వరకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆ 5 ప్రధాన మార్పులు ఏమిటో ఇక్కడ చూడండి.
వాట్సాప్ లేదా మిస్డ్ కాల్ తో చిటికెలో బుకింగ్
గ్యాస్ బుక్ చేసుకోవడానికి ఏజెన్సీల చుట్టూ తిరగడం లేదా కాల్ చేసి గంటల తరబడి లైన్లో వెయిట్ చేయడం లాంటి కష్టాలకు ఇక చెక్ పడినట్లే. వినియోగదారుల సౌకర్యార్థం బుకింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేశారు. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి కేవలం ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా వాట్సాప్ లో మెసేజ్ చేయడం ద్వారా ఇంట్లో కూర్చునే క్షణాల్లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. డిజిటల్ ఇండియా దిశగా ఇదొక అద్భుతమైన ముందడుగు.
ఓటీపీ (OTP) చెబితేనే ఇంటికి సిలిండర్
భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) విధానాన్ని తప్పనిసరి చేశారు. ఇకపై గ్యాస్ డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని అతనికి కచ్చితంగా చెప్పాల్సిందే. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు సిలిండర్ అందుతుంది. ఒకవేళ మీ మొబైల్ నంబర్ గ్యాస్ ఏజెన్సీలో అప్ డేట్ కాకపోతే, డెలివరీ ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే నంబర్ ను నమోదు చేసుకోండి.

బుకింగ్ ల మధ్య కచ్చితమైన సమయ వ్యవధి
గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత, రెండో సిలిండర్ బుక్ చేయడానికి మధ్య ఒక నిర్దిష్ట సమయ వ్యవధిని విధించింది. పట్టణ ప్రాంతాల వినియోగదారులు ఒక సిలిండర్ కు, మరో సిలిండర్ కు మధ్య కనీసం 25 రోజుల గ్యాప్ ఉంచాలి. అదే గ్రామీణ లేదా మారుమూల కొండ ప్రాంతాల వారైతే ఈ కాలపరిమితి 45 రోజులుగా నిర్ణయించబడింది.
పీఎన్‌జీ (PNG), ఎల్పీజీ (LPG) రెండూ ఒకే ఇంట్లో ఉండకూడదు
కొత్త గైడ్ లైన్స్ ప్రకారం, మీ ఇంట్లో పైపుల ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ (PNG) కనెక్షన్ ఉంటే, దానితో పాటు ఎల్పీజీ సిలిండర్ ను వాడటానికి వీల్లేదు. ఎవరికైనా ఇలా రెండు కనెక్షన్లు ఉంటే, వెంటనే ఎల్పీజీ కనెక్షన్‌ను వదులుకోవాలి. ఈ రూల్ ను ఉల్లంఘిస్తే మీ కనెక్షన్ రద్దు చేయబడే ప్రమాదం ఉంది.
ఈ కేవైసీ (e-KYC) తప్పనిసరి
అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన మార్పు ఇదే. మే 1వ తేదీ నుంచి ఈ కేవైసీ అనేది ప్రతి గ్యాస్ వినియోగదారుడికి తప్పనిసరి. మీరు కేవైసీ పూర్తి చేయకపోతే, ఇకపై సిలిండర్ బుకింగ్ సాధ్యపడదు. అంతేకాదు, మీ బ్యాంకు అకౌంట్ లో పడే సబ్సిడీ డబ్బులు కూడా నిలిచిపోతాయి. కాబట్టి వెంటనే ఆధార్ లేదా బయోమెట్రిక్ ద్వారా మీ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోండి.



Click it and Unblock the Notifications
