Latest Updates
-
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా..
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే..
మండుతున్న ఎండలకు శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ద్రవాహారం చాలా ముఖ్యం. వేసవిలో చలువ చేస్తుందని చాలామంది రాగి, జొన్న పిండితో జావలు కాచుకుని మజ్జిగ కలుపుకుని తాగుతుంటారు. అయితే, రోజూ ఒకేరకమైన జావ తాగితే బోర్ కొడుతుంది. అయితే ఓ సారి బార్లీ జావ ట్రై చేయండి. ఇది మామూలు జావలా నీళ్లలా కాకుండా, అచ్చం కమ్మటి కర్డ్ రైస్ లాగా ఉంటుంది. హాయిగా స్పూన్ తో తినేయొచ్చు. బార్లీలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, తక్షణ శక్తిని అందించే అద్భుతమైన గుణాలున్నాయి.
బార్లీ జావ తయారీకి కావాల్సిన పదార్థాలు
బార్లీ గింజలు - 1 కప్పు
కమ్మటి పెరుగు - 1 కప్పు
పచ్చిమిర్చి - 3
క్యారెట్ - 1
అల్లం - ఒక చిన్న ముక్క
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - 1 టీస్పూన్
ఆవాలు- అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
బార్లీ జావ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో బార్లీ గింజలను తీసుకుని రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఎంత బాగా నానితే జావ అంత మృదువుగా, రుచిగా వస్తుంది.
-ఉదయాన్నే నానిన బార్లీలోని నీళ్లను వంపేసి కుక్కర్ లో వేసుకోవాలి. ఒక కప్పు బార్లీకి రెండు కప్పుల చొప్పున నీళ్లు పోసి, మూతపెట్టి మీడియం మంట మీద 4 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి. బార్లీని రాత్రంతా నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది. ఒకవేళ నానబెట్టడం మర్చిపోతే కుక్కర్ లో మరికొన్ని ఎక్కువ విజిల్స్ రానివ్వండి. గింజలు పూర్తిగా ఉడికితేనే కడుపుకు హాయిగా ఉంటుంది.
-కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయాక, ఉడికిన బార్లీని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని చల్లారనివ్వాలి. బార్లీ ఉడికించిన నీటిని పారబోయకుండా పక్కన పెట్టుకోండి.
-చల్లారిన బార్లీని మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా, కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మిశ్రమం గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
-ఇప్పుడు ఈ బార్లీ మిశ్రమంలో ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి మిక్స్ చేయాలి.
-ఇప్పుడు అసలైన టేస్ట్ కోసం తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడిచేయాలి. ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక.. చిటికెడు ఇంగువ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
-గుమగుమలాడే ఈ తాలింపును బార్లీ జావలో వేసి కలుపుకుంటే నోరూరించే బార్లీ బార్లీ జావ రెడీ.
-జావను మరింత ఆకర్షణీయంగా మార్చాలనుకుంటే సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, దానిమ్మ గింజలను కూడా కలుపుకోవచ్చు.
-కుక్కర్ లో బార్లీ ఉడికించిన నీటిని అస్సలు పారబోయకండి. ఆ నీళ్లలో కాస్త నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













