Latest Updates
-
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.!
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్!
వంట అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది పుదీనా, కొత్తిమీర, కరివేపాకు లేదా మెంతి ఆకులు. ఇవి కూరలకు అద్భుతమైన రుచిని, సువాసనను ఇస్తాయి. అయితే, వీటికి ఏమాత్రం తీసిపోని, ఇంకా చెప్పాలంటే అంతకు మించిన అద్భుతమైన గుణాలున్న మరో ఆకుకూర గురించి మీకు తెలుసా? అదే రోజ్ మేరీ. వంటలకు కమ్మని సువాసనను, అమోఘమైన రుచిని అందించడంలో ఇది పెట్టింది పేరు. అందుకే కొందరు ఇప్పుడు కొత్తిమీరకు బదులుగా రోజ్ మేరీని వాడుతున్నారు.

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ మొక్క.. ఇప్పుడు కిచెన్ గార్డెన్లలో సైతం ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. అయితే రోజ్ మేరీ కేవలం వంటలకే పరిమితం అనుకుంటే పొరపాటే. దీనివల్ల మన ఇంటికి, పెరటికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.
బొద్దింకల బెడదకు స్వస్తి
వంటింట్లో బొద్దింకలు చేసే రచ్చ నుంచి విముక్తి పొందాలంటే రసాయనాలు వాడే బదులు, ఎండబెట్టిన రోజ్ మేరీ ఆకులను ఇల్లంతా, ముఖ్యంగా బొద్దింకలు తిరిగే చోట ఉంచండి. ఈ ఆకుల ఘాటు వాసనకు బొద్దింకలు ఇల్లు ఖాళీ చేయడం ఖాయం.
ఇల్లంతా గుబాళించే రూమ్ ఫ్రెషనర్
ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో కొద్దిగా నిమ్మరసం, కొన్ని రోజ్ మేరీ ఆకులు వేసి సన్నని మంటపై మరిగించండి. ఆ నీరు మరుగుతున్నప్పుడు వెలువడే ఆవిరి ఇల్లంతా వ్యాపించి, ఇంటిని ఒక అందమైన పూలతోటలా సుగంధ భరితంగా మారుస్తుంది.
వంటగది బండలు శుభ్రం చేయడానికి
రోజ్ మేరీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు మెండుగా ఉన్నాయి. కొద్దిగా వైట్ వినెగర్ తీసుకుని, అందులో కొన్ని నిమ్మతొక్కలు, గుప్పెడు రోజ్ మేరీ ఆకులు వేసి కాసేపు బాగా మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి. వంటగది బండలు, ఇతర ఉపరితలాలను శుభ్రం చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కావాలంటే సువాసన కోసం మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు కలుపుకోవచ్చు.
వార్డ్ రోబ్ లోని పురుగులకు చెక్
మన బట్టల అలమరల్లో (వార్డ్ రోబ్స్) తరచుగా చిన్నచిన్న పురుగులు చేరి బట్టలను పాడుచేస్తుంటాయి. బాగా ఎండిపోయిన రోజ్ మేరీ ఆకులను ఒక చిన్న వస్త్రంలో మూటగట్టి వార్డ్ రోబ్ మూలల్లో ఉంచితే..ఆ వాసనకు పురుగులు దరిచేరవు, పైగా బట్టలు కూడా మంచి సువాసనతో ఉంటాయి.

పండుగలకు పచ్చని అలంకరణ
శుభకార్యాల సమయంలో ఇంటి అలంకరణ కోసం రోజ్ మేరీ కొమ్మలను వాడుకోవచ్చు. పూలతో పాటు ఈ ఆకులను కలిపి ఇంటి గుమ్మానికి, పూజా మందిరానికి అలంకరిస్తే ఇంటికి పచ్చని కళ రావడమే కాకుండా, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
పెరట్లోని మొక్కలకు రక్షక కవచం
బాల్కనీలోనో, పెరట్లోనో ఎంతో మురిపెంగా మనం పెంచుకునే కాయగూరల మొక్కలకు తరచుగా చీడపీడల బెడద వస్తుంటుంది. ఈ సమస్యను సహజ పద్ధతిలో వదిలించుకోవాలంటే ఆ మొక్కల మధ్యలో ఒక రోజ్ మేరీ మొక్కను ఉంచడమే ఉత్తమమైన మార్గం. దీని నుండి వచ్చే పరిమళం మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఆ వాసన అంటే పంటను నాశనం చేసే పురుగులకు అస్సలు పడదు. ఆ ఘాటుకు చీడపీడలు ఆమడదూరం పారిపోతాయి.



Click it and Unblock the Notifications