Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు!
సీఫుడ్ అంటే ఇష్టమా ఐతే సాల్మన్ ఫిష్ ఫ్రై రుచిచూడాల్సిందే
మీకు సీఫుడ్ అంటే ఇష్టమా? అయితే మీకు సాల్మన్ కనబడితే ఫి(ని)ష్ ఫెస్టివల్ చేసుకొండి. మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్ ఫిష్ ప్రొటీన్‌తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి.

కావలసిన పదార్థాలు
సాల్మన్ చేప ముక్కలు: 1/2kg
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
కారం: 2tsp
ధనియాల పొడి: 2tsp
కార్న్ ఫ్లోర్(మొక్క జొన్న)పిండి: 2tsp
గడ్డ పెరుగు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: 2tbsp
నూనె : ఫ్రై చేయడానికి కావలసినంత
తయారు చేయు విధానం
1. ముందుగా సాల్మన్ ఫిల్లెట్స్ చేపలను పై పొట్టు లాంటి చర్మం లేదా కవచాన్ని తొలగించి, కావలసినంత సైజులో ముక్కలుగా కట్ చేసి తర్వతా పసుపు, ఉప్పు వేసి బాగా రుద్ది మంచి నీళ్ళతో శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. నీళ్ళంతా శుభ్రంగా వడలిపోయే విధంగా చూసుకోవాలి.
2. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్, పెరుగు, నిమ్మరసం, కారం, ఉప్పు, ధనియాలపొడి వేసి పేస్ట్ లాగే తయారు చేసుకోవాలి. నీరు కలపనవసరం లేదు(అల్లం వెల్లుల్లి, పెరుగు, నిమ్మరసంతోనే మెత్తని పేస్ట్ లా తయారవుతుంది)
3. ఇప్పుడు సాల్మన్ ఫిల్లెట్స్ చేప ముక్కలను ఒక్కొక్కదాన్నే తీసుకొని వాటికి ఈ మసాలా పేస్ట్ ను బాగా అప్లై చేయాలి.
4. ఇలా మసాలాతో తయారు చేసి పెట్టుకొన్ని సాల్మన్ ఫిల్లెట్ చేపముక్కలను 2 లేదా 3 గంటలపాటు అలాగే పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక రెండు లేదా మూడు సాల్మన్ ఫిల్లెట్స్ చేప ముక్కలను అందులో వేసి, తక్కువ మంట మీద బాగా ఫ్రై చేయాలి. ఇవి రెండు వైపులా బాగా కాలి, బ్రౌన్ కలర్ లోనికి మారేంత వరకూ ఫ్రై చేసి, తీసి పక్కన పెట్టుకోవాలి.
6. నూనె ఎక్కువగా ఉన్నట్లు అనిపితస్తే చేపముక్కలను పాన్ లో నుండి తీసిన వెంటన్ పేపర్ టవల్ మీద వేసి వత్తి వేడి, వేడిగా సర్వ్ చేయాలి. ఇంకా లెమన్, గ్రీన్ మిర్చి, వెల్లుల్లిపాయతో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది. అంతే సాల్మన్ ఫిష్ ఫిల్లెట్ రెడీ.



Click it and Unblock the Notifications