Latest Updates
-
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి -
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే..
తవా ముర్గ్ - స్పెషల్ స్టార్టర్స్

ఈ తవా ముర్గ్ చికెన్ బ్రెస్ట్ తో తయారుచేసుకోవచ్చు. కొన్ని పదార్థాలతో మ్యారినేట్ చేసుకొని తవాలో ఫ్రై చేయడం వల్ల తవా ముర్గ్ అంటారు. కొన్ని మసాలా దినుసులతోనే అద్భుతమైన రుచితో తయారయ్యే ఈ స్పెషల్ ముర్గ్ ను లంచ్ లేదా డిన్నర్ కి ముందు స్టార్టర్స్‌లా తీసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
చికెన్ బ్రెస్ట్ పీస్: 250grms
శనగపిండి: 2tbsp
గుడ్డు సొన: 1tbsp
వెనిగర్: 2tbsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
ధనియాలపొడి: 2tsp
జీలకర్రపొడి: 1tsp
గరం మసాల పౌడర్: 1tsp
నిమ్మరసం: 2tbsp
నూనె: 1tbsp
అల్లంవెల్లుల్లి పేసు: 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ బ్రెస్ట్ పీస్‌ని శుభ్రంగా కడిగి పలుచని స్లైస్ గా కట్ చేసుకోవాలి.
2. తర్వాత ముక్కల మీద శనగపిండి చల్లి చేత్తో కలపాలి. శనగపిండి ముక్కల్లో తడిని పీల్చుకోవడమే కాక పచ్చివాసనని కూడా తగ్గిస్తుంది.
3. ఇప్పుడు ఒక బౌల్‌లో చికెన్ పీసెస్, అల్లంవెల్లుల్లి ముద్ద, వెనిగర్, గుడ్డు సొన, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరమ్ మసాల పౌడర్, నిమ్మరసం కలిపి 10 నిమిషాలపాటు నానబెట్టాలి.
4. తర్వాత నాన్ స్టిక్ పాన్ లేదా తవా ని స్టౌ మీద పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక నానబెట్టిన చికెన్ ముక్కలని వేసి తక్కువ సెగ మీద ఎరుపు రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. వీటిని లంచ్ లేదా డిన్నర్ కి ముందు స్టార్టర్స్‌లా తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications