Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వెరైటీ పాలకూర చికెన్..

కావలసిన పదార్థాలు:
చికెన్ - 1 కేజీ
పాలకూర - 4 కట్టలు
టమాటాలు - 2
ఉల్లిపాయ - 1
పసుపు - 1/2 టేబుల్ స్పూను
కారం పొడి - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
గరం మసాలా పొడి - 1/4 టేబుల్ స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టేబుల్ స్పూన్లు
నూనె - తగినంత
తయారీ విధానం:
1. మొదట పాలకూరను కడిగి నీరు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించి తర్వాత జల్లెడలో వెయ్యాలి.
2. ఆ తర్వాత తరిగిన టమాటా ముక్కలను, ఈ పాలకూరను పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె పోసి అది వేడెక్కిన తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి ఎర్రబడే వరకూ వేయించాలి. తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వెల్లులి పేస్టు, కారం పొడి వేసి రెండు నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను, ఉప్పువేసి బాగా కలిపి మూత పెట్టాలి.
4. ముక్కలు వేగాకా పాలకూర ముద్దను వేసి, గరం మసాలా పొడి, అరకప్పు నీరు పోసి కలిపి మూత పెట్టి నిదానంగా ఉడకనివ్వాలి.
5. ముక్కలు ఉడికి నూనె పైకి తేలిన తర్వాత దింపేయాలి.
ఈ కూర అన్నం, రొట్టెలలోకి బాగుంటుంది.



Click it and Unblock the Notifications