Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
చికెన్ & ఆలు కర్రీ: టేస్టీ అండ్ హెల్తీ
చికెన్ చాలా మందికి ఇష్టమైన ఆహారం. ఆలూ, చికెన్ రెండూ ఇష్టపడే వారికి ఒక చక్కటి కాంబినేషన్ డిష్ ఇది. ఇండియన్ మసాల దినుసులతో తయారుచేసే ఈ వంట మంచి ఆరోమా వాసనతో పాటు, రుచి కలిగి ఉంటుంది. ఆలులో పూర్తి పోషఖాలు, చికెన్ లోని ప్రోటీనులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఈ లీన్ మీట్ ను బరువు తగ్గాలనుకొనే వారు, డైట్ ను అనుసరించే వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. రెడ్ మీట్ తో పోల్చితే చికెన్ లో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. కాబట్టి, డైటింగ్ చేసే వారు కూడా ఈ కర్రీని నిరభ్యంతరంగా తినవచ్చు. దీన్ని తయారుచేయడం చాలా సులభం. మీరు లంచ్ కు దీన్ని త్వరగా తయారుచేసుకోవాలంటే, ప్రెజర్ కుక్కర్ లో చికెన్ మరియు బంగాళదుంపలను వేసి ఒకే సారి ఉడికించుకొని తర్వాత మసాల, పోపుదినుసులతో ఫ్రై చేసుకోవచ్చు. మరి ఈ ఆలూ చికెన్ కర్రీని ఎలా తయారుచేయాలో చూద్దాం...

చికెన్ : ½ kg (ఎముకలు చికెన్ ముక్కలు)
ధనియాలు: 1 tsp
ఆవాలు: 1tsp
లవంగం: 3
బే ఆకు : 2
గ్రీన్ ఏలకులు: 4
పసుపు పొడి : 1tbsp
కారం: 1 ½tbsp
ధనియాల పొడి: 1tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా తరిగినవి)
బంగాళదుంపలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
ఉప్పు : రుచికి సరిపడా
టమోటా: 1(చిన్న ముక్కలుగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు :1 (సన్నగా తరిగినవి)
కొత్తిమీర తరుగు: కొద్దిగా (సన్నగా తరిగినవి)
నీళ్ళు: చికెన్ ఉడికించుకోవడానికి

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, బిర్యానీ ఆకు, యాలకలు, వేసి వేగించుకోవాలి.
2. పోపు ఆరోమా స్మెల్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, జీలకర్ర మరియు ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి.

4. పోపువేగే లోపు అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు బంగాళదుంప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
5. మొత్తం మిశ్రామన్ని కలగలుపుకొని, మూత పెట్టి ఉడికించుకోవాలి.
6. కొద్దిసేపటి తర్వాత మూత తీసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

8. ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఉప్పు వేసి, మిక్స్ చేసి తిరిగి మూత పెట్టి మరో 10 నిముషాలు ఉడికించుకోవాలి.
9. చికెన్, ఆలూ రెండు మెత్తగా ఉడికే సమయంలో అందులో టమోటో ముక్కలు, తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.

11. 10 నిముషాల తర్వాత మూత తీసి అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.
12. గార్నిష్ చేసి మరో 5నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.




Click it and Unblock the Notifications