Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
టేస్టీ అండ్ స్పైసీ గోబి 65 డ్రై రిసిపి
ఈజీ గోబీ 65 చాలా టేస్టీగా ఉండే స్నాక్ లేదా సైడ్ డిష్ వంటి రిసిపి . ఈ స్పైసీ గోబీ 65రిసిపిని రసం మరియు పెరుగు అన్నంకు సైడ్ డిష్ గా తినవచ్చు.
ఈ గోబి 65డ్రై రిసిపి తయారుచేయాడానికి కొన్ని మసాలా దినుసులు అవసరం అవుతాయి. ఈ గోబి 65 తయారుచేయడానికి కొద్దిగా సమయం పడుతుంది . మొదట కాలీఫ్లవర్ ను 20నిముషాలు వేడినీళ్ళలో వేసి నానబట్టి శుభ్రం చేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ పదార్థాలు మ్యారినేట్ చేసి 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రైచేసి కొత్తిమీర, నిమ్మరసంతో గార్నిష్ చేసి వడ్డించాలి. అంతే గోబి 65 రెడీ..

కావల్సిన పదార్థాలు:
గోబి(కాలీఫ్లవర్): 1(చిన్న చిన్న ఫ్లవర్స్ గా విడిపించుకోవాలి)
పెరుగు: 100ml
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
కార్న్ ఫ్లోర్: 2tbsp
లెమన్ జ్యూస్: 1/2tsp
గరం మసాలా: 1tbsp
కారం: 1tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్: చిటికెడు
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా కాలీఫ్లవర్ ను శుభ్రంగా కడిగి సగం ఉడికించుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా పౌడర్, కారం, పెప్పర్ పౌడర్, ఫుడ్ కలర్ మరియు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రం మరీ చిక్కగాను లేదా మరీ పల్చగానూ ఉండకూడదు. మీడియంగా కలిపి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ముందుగా మీడియంగా ఉడికించి పెట్టుకొన్న కాలీఫ్లవర్ ను పిండిలో వేసి బాగా మిక్స్ చేసి 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడయ్యాక అందులో పిండిలో మిక్స్ చేసి పెట్టుకొన్న కాలీఫ్లవర్ కొద్ది కొద్దిగా వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని, అందులో నిమ్మరసం మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగాసర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications