Latest Updates
-
చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు.. ఆగస్టు 25 నుంచి ఈ 3 రాశులకు కుప్పలుతెప్పలుగా ధనాగమం! -
సండే స్పెషల్: నోరూరించే ఎగ్ ఘీ రోస్ట్ మసాలా..నాలుకకి పండగే పండగ..వేళ్లు నాక్కుంటూ తినేస్తారు! -
బ్లాక్ కాఫీలో నిమ్మకాయ వేసి తాగితే ఏమవుతుందో తెలుసా? -
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్ -
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం.. -
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం -
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే..
పుల్లపుల్లగా, కారంకారంగా..నోరూరించే ఒడిశా స్పెషల్ అంబుల రాయ్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
పచ్చి మామిడికాయతో చేసే వంటల రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఒడిశా రాష్ట్రంలో ఎండబెట్టిన పచ్చి మామిడికాయలతో చేసే ఒక అద్భుతమైన సంప్రదాయ వంటకం అంబుల రాయ్ (Ambula Rai). పచ్చి మామిడికాయ ముక్కలకు ఉప్పు రాసి ఎండబెట్టి నిల్వ చేసుకునే పద్ధతిని ఒడిశాలో అంబుల అంటారు. ఈ అంబులతో చేసే అంబుల రాయ్ ఒక క్లాసిక్ వంటకం. పుల్లపుల్లగా, కారంకారంగా ఉంటూనే, కొబ్బరి కమ్మదనాన్ని, ఆవాల ఘాటును అద్భుతంగా కలగలిపిన ఈ వంటకం భోజన ప్రియులను ఇట్టే కట్టిపడేస్తుంది.

అంబుల రాయ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
అంబుల (ఎండబెట్టిన పచ్చి మామిడి ముక్కలు) - 6 లేదా 7
పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
అల్లం - ఒక అంగుళం ముక్క
పచ్చిమిర్చి - 1 లేదా 2
ఉప్పు - రుచికి సరిపడా
పంచదార - చిటికెడు
నీళ్లు - నానబెట్టడానికి రుబ్బడానికి తగినన్ని,
ఆవనూనె - 1 లేదా 2 టీస్పూన్లు
పంచ్ ఫోరన్ (ఐదు సుగంధ ద్రవ్యాల మిశ్రమం) - అర టీస్పూన్
ఎండుమిర్చి - 1 లేదా 2
కరివేపాకు - కొద్దిగా
అంబుల రాయ్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో అంబుల (ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు) వేసి సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ముక్కలు మెత్తగా మారి, తమలోని సహజమైన పులుపును బయటకు వదులుతాయి.
-మరో గిన్నెలో పెరుగు వేసి అందులో నీళ్లు పోసి విస్కర్ తో బాగా గిలకొట్టినట్లు చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక కప్పు తాజా కొబ్బరి తురుము, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా, కొంచెం బరకగా ఉండేలా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు పెరుగు మిశ్రమం ఉన్న గిన్నెలో తగినంత ఉప్పు, ఒక చిటికెడు పంచదార, రుబ్బి పెట్టుకున్న ఆవాలు-కొబ్బరి మిశ్రమాన్ని వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత అందులో మెత్తబడిన అంబుల ముక్కలను (అవి నానబెట్టిన నీళ్లతో సహా కొద్దిగా) వేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన ఉంచితే.. మామిడికాయ పులుపు, ఆవాల ఘాటు, కొబ్బరి కమ్మదనం అన్నీ ఒకదానికొకటి చక్కగా పట్టుకుంటాయి.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి ఆవనూనె వేడి చేయండి. ఆవనూనె నుంచి పొగలు వచ్చే సమయంలో మంట తగ్గించి అందులో పంచ్ ఫోరన్, ఎండుమిర్చి, కరివేపాకు వేయండి. అవి చిటపటలాడుతూ అద్భుతమైన సువాసన వస్తుండగా, ఆ వేడివేడి తాలింపును నేరుగా అంబుల మిశ్రమంపై పోసి నిదానంగా కలపండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే ఒడిశా స్పెషల్ అంబుల రాయ్ రెడీ.
-వేడివేడి అన్నం, పప్పుతో పాటు సైడ్ డిష్ గా దీన్ని తింటే ఆ రుచిని మీరెప్పటికీ మర్చిపోలేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications