Latest Updates
-
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.!
మహిళలు, పిల్లల ఎముకల బలానికి అమృతం లాంటి నల్ల మినపపప్పు చట్నీ..ఇడ్లీ,దోశెలతో సూపర్ టేస్ట్
వేడి వేడి ఇడ్లీలు లేదా దోశల పిండి సిద్ధంగా ఉన్నప్పటికీ, వాటిలోకి రోజువారీ చేసుకునే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలు తిని మీ కుటుంబ సభ్యులకు బోర్ కొట్టేసిందా? అయితే టిఫిన్ సెంటర్ స్టైల్ నల్ల మినపపప్పు చట్నీట్రై చేయండి. సాధారణంగా నల్ల మినపపప్పులో (పొట్టు మినపపప్పు) పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు, ఎదిగే పిల్లలకు ఎముకల దృఢత్వానికి ఇది అమృతం లాంటిది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ కమ్మని చట్నీని చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

నల్ల మినపప్పు చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
వంటనూనె - 2 టీస్పూన్లు
ఎండు మిరపకాయలు - 6
నల్ల మినపపప్పు (పొట్టుతో ఉన్నది) - 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - 1 రెమ్మ
వెల్లుల్లి రెబ్బలు - 4 లేదా 5
సాంబార్ ఉల్లిపాయలు- 6
టమాటాలు - 3
ఉప్పు - మీ రుచికి సరిపడా
నీళ్లు - తగినంత
తాలింపుకి నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినపపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఎండు మిరపకాయ - 1
నల్ల మినపప్పు చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి కడాయి లేదా పాన్ పెట్టుకోండి. అందులో 2 టీస్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె కాస్త వేడెక్కగానే ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే నూనెలో నల్ల మినపపప్పు వేయండి. మంటను సిమ్ లో ఉంచి, పప్పు మాడిపోకుండా దోరగా వేయించండి. ఆ తర్వాత అందులోనే కరివేపాకు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిసేపు వేయించాలి. దానికి చిన్న ఉల్లిపాయలను కూడా జతచేసి మరో రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేలా బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీదన ఉన్న అదే కడాయిలోని నూనెలో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేయండి. తొందరగా మగ్గడానికి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి, టమాటాలు మెత్తగా గుజ్జులా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆపేయండి. వీటిని కూడా చల్లారనివ్వండి.
-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా చల్లారిన మినపపప్పు, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి బాగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత ఉడికించిన టమాటా మిశ్రమాన్ని, కొద్దిగా నీళ్లను పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ చట్నీ మరీ గట్టిగా కాకుండా కాస్త పల్చగా ఉంటేనే టిఫిన్ సెంటర్ స్టైల్ రుచి వస్తుంది. దానికి తగ్గట్టుగా జార్ లో మరికొన్ని నీళ్లు పోసి కలుపుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-చివరగా తాలింపు కోసం చిన్న పాన్ పెట్టి, నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, మినపపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి చిటపటలాడనివ్వండి. ఈ పోపును తీసుకెళ్లి సిద్ధం చేసుకున్న చట్నీలో కలపండి.
-అంతే నోరూరించే టిఫిన్ షాప్ స్టైల్ నల్ల మినపపప్పు చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీలపైన కాస్త నెయ్యి వేసుకుని, ఈ చట్నీని అద్దుకుని తింటుంటే ఆ మజాయే వేరు. ఒకటికి నాలుగు ఇడ్లీలు లాగించేస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
