Latest Updates
-
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.! -
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి! -
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.! -
పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్,,లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపి ఇది! -
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.? -
నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది!
ఫుల్ ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్..మిల్ మేకర్ అప్పాలు ఇలా చేస్తే జన్మలో మర్చిపోలేని టేస్ట్!
మన రోజువారీ ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడూ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరీ వంటివి కాకుండా కాస్త వెరైటీగా, ఆరోగ్యకరంగా, అలాగే త్వరగా అయిపోయే బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకుంటే మిల్ మేకర్ అప్పాలు బెస్ట్ ఛాయిస్. మిల్ మేకర్ (సోయా)లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ అప్పాలను ఎంతో ఇష్టంగా తింటారు. పైగా దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మన ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఫుల్ ప్రొటీన్ మిల్ మేకర్ అప్పాలు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మిల్ మేకర్ అప్పాలు తయారీకి కావలసిన పదార్థాలు
-మిల్ మేకర్ (సోయా చంక్స్) - 1 కప్పు
-బియ్యం పిండి
-గోధుమ పిండి
-నువ్వులు
-వంట సోడా
-ఉల్లిపాయలు
-పచ్చిమిర్చి
-టమాటో
-అల్లం
-వెల్లుల్లి
-జీలకర్ర
-ఉప్పు
-నూనె
-పసుపు
-కారం
-గరం మసాలా పొడి
-ధనియాల పొడి
-క్యారెట్ తురుము

మిల్ మేకర్ అప్పాలు తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు మిల్ మేకర్ వేయండి. ఇందులో వేడి నీళ్లు పోసి 5-10 నిమిషాలు మిల్ మేకర్ నాననివ్వండి.
-10 నిమిషాల తర్వాత నానిన మిల్ మేకర్ ని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని ఎక్స్ ట్రా నీటిని పిండేసి వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టి నీటిని పిండేసిన మిల్ మేకర్, 4 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చి మిరపకాయలు, 1 టమాటో ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి.
-గ్రైండ్ చేసుకున్న మిశ్రమంని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ కారం, అర టీస్పూన్ గరం మసాలా పొడి,అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇందులోనే ఇప్పుడు అర కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పావు కప్పు క్యారెట్ తురుము, అర కప్పు బియ్యం పిండిని, అర కప్పు గోధుమ పిండిని వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా 1 కప్పు నీళ్లు పోస్తూ కలుపుకోండి.
-కలుపుకున్న పిండి మిశ్రమంలోనే పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ జీలకర్ర, చిటికెడు వంట సోడా వేసి ఇవన్నీ కలిసేలా గరిటతో కలుపుకోండి.
-ఇప్పుడు కలుపుకున్న పిండిని అప్పంలా చేసుకోడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 2 టీస్పూన్ల నూనె, కొంచెం తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం గరిటెడు వేసి దానిని ఉత్తప్పంలా స్ప్రెడ్ చేసుకోండి. దీని మీద మళ్లీ కొంచెం నువ్వులు చల్లుకోని, 1 టీస్పూన్ ఆయిల్ కూడా వేసి మూతపెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి.
-1-2 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీస్తే అడుగుభాగం చక్కగా ఫ్రై అయ్యి పైన తడి ఆరిపోతుంది. ఒక వైపు ఎర్రగా కాలిన తర్వాత, మెల్లగా రెండో వైపుకు తిప్పి, మళ్లీ కొద్దిగా నూనె వేసి రెండు వైపులా క్రిస్పీగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి.
-కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఇలాగే చిన్న చిన్న అప్పాలుగా చేసుకోండి.
-పల్లీ,కొబ్బరి చట్నీతో దీన్ని తింటుంటే అదిరిపోతుంది. సాయంత్రం స్నాక్ గా దీన్ని తీసుకుంటే తమాటో సాస్ తో, చట్నీ పౌడర్ తో నంజుకుంటే బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications