Latest Updates
-
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.!
ఆరోగ్యానికి గుమ్మడికాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులోని పోషకాలు శరీరానికి ఆరోగ్యప్రదాయిని. ఇక గింజలు స్త్రీపురుషుల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. అయితే ఈ గుమ్మడికాయలను ఇంట్లో చాలా అరుదుగా వండుతుంటాం. గుమ్మడి వడియాలు, దప్పళం ఇలా రకరకాల వెరైటీలు చేస్తాం. కానీ ఇలా తీపి గుమ్మడికాయతో ఉల్లికారం చేశారంటే ఉగాది షడ్రుచులను ఒక్క ముద్దలోనే రుచి చూసేస్తారు.

గుమ్మడికాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె- 12 టేబుల్ స్పూన్లు
ఆవాలు- పావు టీస్పూన్
ఎండు మిర్చి- రెండు
కరివేపాకు- రెండు రెబ్బలు
పండిన తీపి గుమ్మడికాయ - అర కేజీ
బెల్లం- రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు- అరకేజీ
చింతపండు- నిమ్మకాయ సైజు
ఉప్పు- రుచికి సరిపడా
కారం- రెండున్నర టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి- టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
గుమ్మడికాయ ఉల్లికారం తయారీ విధానం
ముందుగా బాగా పండిన తీపి గుమ్మడికాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మందపాటి కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
తాలింపు వేగిన తర్వాత పండిన తీపి గుమ్మడికాయ ముక్కలు వేసి నూనెలో మగ్గనివ్వాలి. కాసేపు కలిపిన తర్వాత మూత పెట్టి చిన్న మంటపైన వేగనివ్వాలి.
మిక్సీ జార్లో బెల్లం, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి నీళ్లు పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ గ్రైండ్ చేసుకున్న ముద్దను కడాయిలో వేగిన గుమ్మడి ముక్కల్లో వేసి కలిపి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా చిన్న మంటపైన వేగనివ్వాలి. నూనె పైకి తేలుతూ మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
బెల్లం, కారం, ఉప్పు, గుమ్మడి తీపి, చేదు, ఘాటు ఈ ఆరు రుచుల మేళవింపుతో తయారైన ఈ గుమ్మడి ఉల్లికారం రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే. ప్రతి ముద్దకీ కొత్త అనుభూతిని పొందుతారు.
గుమ్మడిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని తరచూ తీసుకోవడం ద్వారా కంటి చూపునకు, గుండె ఆరోగ్యాన్ని, జీర్ణక్రియకు దోహదపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
