ఒకే ప్లేట్‌లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.!

ఆరోగ్యానికి గుమ్మడికాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులోని పోషకాలు శరీరానికి ఆరోగ్యప్రదాయిని. ఇక గింజలు స్త్రీపురుషుల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. అయితే ఈ గుమ్మడికాయలను ఇంట్లో చాలా అరుదుగా వండుతుంటాం. గుమ్మడి వడియాలు, దప్పళం ఇలా రకరకాల వెరైటీలు చేస్తాం. కానీ ఇలా తీపి గుమ్మడికాయతో ఉల్లికారం చేశారంటే ఉగాది షడ్రుచులను ఒక్క ముద్దలోనే రుచి చూసేస్తారు.

pumpkin ulli kaaram recipe with six tastes healthy dish ever

గుమ్మడికాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు

నూనె- 12 టేబుల్‌ స్పూన్లు
ఆవాలు- పావు టీస్పూన్‌
ఎండు మిర్చి- రెండు
కరివేపాకు- రెండు రెబ్బలు
పండిన తీపి గుమ్మడికాయ - అర కేజీ
బెల్లం- రెండు టేబుల్‌ స్పూన్లు
ఉల్లిపాయలు- అరకేజీ
చింతపండు- నిమ్మకాయ సైజు
ఉప్పు- రుచికి సరిపడా
కారం- రెండున్నర టేబుల్‌ స్పూన్లు
ధనియాల పొడి- టీస్పూన్‌
పసుపు- పావు టీస్పూన్‌

గుమ్మడికాయ ఉల్లికారం తయారీ విధానం

ముందుగా బాగా పండిన తీపి గుమ్మడికాయను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తర్వాత మందపాటి కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.

తాలింపు వేగిన తర్వాత పండిన తీపి గుమ్మడికాయ ముక్కలు వేసి నూనెలో మగ్గనివ్వాలి. కాసేపు కలిపిన తర్వాత మూత పెట్టి చిన్న మంటపైన వేగనివ్వాలి.

మిక్సీ జార్‌లో బెల్లం, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి నీళ్లు పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

pumpkin ulli kaaram recipe with six tastes healthy dish ever

ఈ గ్రైండ్‌ చేసుకున్న ముద్దను కడాయిలో వేగిన గుమ్మడి ముక్కల్లో వేసి కలిపి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా చిన్న మంటపైన వేగనివ్వాలి. నూనె పైకి తేలుతూ మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే.

బెల్లం, కారం, ఉప్పు, గుమ్మడి తీపి, చేదు, ఘాటు ఈ ఆరు రుచుల మేళవింపుతో తయారైన ఈ గుమ్మడి ఉల్లికారం రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే. ప్రతి ముద్దకీ కొత్త అనుభూతిని పొందుతారు.

గుమ్మడిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీనిని తరచూ తీసుకోవడం ద్వారా కంటి చూపునకు, గుండె ఆరోగ్యాన్ని, జీర్ణక్రియకు దోహదపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

[ of 5 - Users]
Story first published: Friday, October 2, 2026, 11:05 [IST]
Desktop Bottom Promotion