Latest Updates
-
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు -
గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఆగస్టు 19 నుంచి ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి! -
జుట్టు రాలడం తగ్గాలంటే.. వారానికోసారి ఈ కరివేపాకు ఎగ్ రైస్ తినాల్సిందే!..లంచ్ బాక్స్ కి బెస్ట్ -
ఇంట్లోనే పక్కా హోటల్ స్టైల్ వెజ్ కుర్మా.. రెస్టారెంట్ చెఫ్ లు వాడే సీక్రెట్ ఇదే! -
ఏ కూరగాయలు, పండ్లు తినాలి? సద్గురు చెప్పిన ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యే ఉండదు! -
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే దొండకాయ రోటీ పచ్చడి.. ఇలా చేశారంటే ఇక కూరల జోలికి వెళ్లరు.! -
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.!
పంజాబీ ఫేమస్ చిక్కడ్ చోలే.. పూరీ, కుల్చాకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్!
వీకెండ్ వస్తే చాలు నార్త్ ఇండియన్ స్టైల్ చోలే మసాలా తినాలని చాలామందికి నోరూరుతుంది. అయితే మీరు ఎప్పుడైనా పంజాబ్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన చిక్కడ్ చోలే రుచి చూశారా? పంజాబీ భాషలో చిక్కడ్ అంటే కొద్దిగా మందంగా లేదా చిక్కగా అని అర్థం. సాధారణ చోలే కర్రీ కంటే ఇది చాలా భిన్నంగా, అద్భుతంగా ఉంటుంది. ఉడికించిన బంగాళాదుంపలు, శనగలను మెత్తగా రుబ్బి ఇందులో కలుపుతారు కాబట్టి దీని గ్రేవీ అత్యంత చిక్కగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది.

చిక్కడ్ చోలే తయారీకి కావలసిన పదార్థాలు
కాబూలీ శనగలు - 1 కప్పు
బంగాళదుంప - 1
బిర్యానీ ఆకులు - 2
దాల్చినచెక్క - 1 అంగుళం ముక్క
పెద్ద యాలకులు - 2
లవంగాలు - 5-6
వెల్లుల్లి రెబ్బలు - 10-12
అల్లం - 2 అంగుళాలు
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర కాడలు - కొద్దిగా
పెరుగు - అర కప్పు
ఆవ నూనె - 2-3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
ఉల్లిపాయలు - 2
చనా మసాలా - 1.5 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
కసూరి మెంతి - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2
సన్నగా తరిగిన అల్లం - కొద్దిగా
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
చిక్కడ్ చోలే తయారీ విధానం
-ముందుగా శనగలను రాత్రంతా నానబెట్టుకోవాలి.
-తర్వాత రాత్రంతా నానబెట్టిన శనగలు, బంగాళదుంపను ప్రెషర్ కుక్కర్ లో వేయండి. ఒక చిన్న శుభ్రమైన కాటన్ వస్త్రంలో బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, పెద్ద యాలకులు, లవంగాలు వేసి మూటలా కట్టి కుక్కర్ లో వేయండి. శనగలు మునిగి, ఒక అంగుళం పైకి ఉండేలా నీళ్లు పోసి, మీడియం మంట మీద సుమారు 15 నిమిషాల పాటు మెత్తగా ఉడికించండి.
-కుక్కర్ చల్లారాక మూత తీసి, మసాలా మూటను పక్కకు తీసేయండి. ఉడికించిన బంగాళదుంపను, గుప్పెడు శనగలను వేరే గిన్నెలోకి తీసుకోండి. ఇవి చల్లారాక, మిక్సీ జార్ లో వేసి.. అందులోనే వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు, పెరుగు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఇదే గ్రేవీకి అసలైన చిక్కదనాన్ని ఇస్తుంది.
-ఇప్పుడు ఒక బాండీలో ఆవనూనె వేడి చేయండి. జీలకర్ర, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా ఎర్రబడేవరకు వేయించండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న శనగల పేస్ట్ వేసి కలపండి. తర్వాత చనా మసాలా, ఉప్పు వేసి మసాలా పచ్చివాసన పోయేలా బాగా వేయించండి. ఇప్పుడు కుక్కర్ లో మిగిలి ఉన్న ఉడికించిన శనగలను, వాటి నీటితో సహా పోసి బాగా కలపండి. 7-8 నిమిషాలు ఉడికించండి. గ్రేవీ అద్భుతంగా చిక్కబడటం మీరే గమనిస్తారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.
-ఇప్పుడు మరో చిన్న పాన్ లో నెయ్యి వేడి చేసి ఇంగువ, కసూరి మెంతి, పచ్చిమిర్చి, అల్లం, కాశ్మీరీ కారం వేసి వేయించండి. గుమగుమలాడే ఈ తాలింపును నేరుగా ఉడుకుతున్న శనగల కర్రీపై పోసి కలపండి. పైన తాజా కొత్తిమీర చల్లితే చాలు పంజాబీ స్టైల్ చిక్కడ్ చోలే రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications