Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
థాయ్‌లాండ్ ఫేమస్ మ్యాంగో స్టిక్కీ రైస్.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి!
భారతీయుల విదేశీ ప్రయాణాల జాబితాలో ప్రస్తుతం థాయ్‌లాండ్ పేరు అగ్రస్థానంలో ఉంటోంది. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆకట్టుకునే సంస్కృతి, ప్రకృతి అందాలు ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తాయి. అయితే థాయ్‌లాండ్ వెళ్లే భారతీయులు అక్కడి అందాలకే కాకుండా అద్భుతమైన వంటకాలకు కూడా ఫిదా అవుతున్నారు. అలా మనవారి మనసు దోచుకున్న ఒక అద్భుతమైన థాయ్ వంటకమే మ్యాంగో స్టిక్కీ రైస్. ఒక్కసారి రుచి చూశారంటే ఆ మధురానుభూతిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు.

ఇదొక ప్రసిద్ధ సాంప్రదాయ థాయ్ తీపి వంటకం. పండిన, నోరూరించే తీయని మామిడి పండ్ల ముక్కలు, కమ్మటి కొబ్బరి పాలు, జిగురుగా ఉండే ప్రత్యేకమైన బియ్యం.. ఈ మూడింటి అద్భుతమైన కలయికే మామిడి స్టిక్కీ రైస్. మన ఇంట్లోని వంటగదిలోనే చాలా సులభంగా, అచ్చమైన థాయ్ రుచితో దీనిని తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు కూడా మనకు మార్కెట్లో సులభంగానే దొరుకుతాయి.
మ్యాంగో స్టిక్కీ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
స్టిక్కీ రైస్ లేదా పొట్టి గింజల బియ్యం (సోనా మసూరి లాంటివి) - 1
కప్పు
తీయని మామిడి పండు - 1
చిక్కటి కొబ్బరి పాలు - 1 కప్పు
పంచదార - 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు - పావు టీస్పూన్
వేయించిన నువ్వులు లేదా డ్రై ఫ్రూట్స్ - 1 టీస్పూన్
మ్యాంగో స్టిక్కీ రైస్ తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, సుమారు 3-4 గంటల పాటు నీటిలో నానబెట్టండి. అనంతరం నీటిని వడకట్టి, ఆవిరి (స్టీమ్) మీద మెత్తగా ఉడికించండి. మీ దగ్గర స్టీమర్ లేకపోతే, కుక్కర్ లో సాధారణ అన్నంలా వండుకోవచ్చు. కాకపోతే అన్నం మరీ పేస్ట్ లాగా కాకుండా, కొద్దిగా అంటుకునేలా చూసుకోండి.
-ఒక గిన్నెలో చిక్కటి కొబ్బరి పాలు, చక్కెర, చిటికెడు ఉప్పు వేసి చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని వేడి చేయండి. పాలు మరగకూడదు, కేవలం పంచదార కరిగే వరకు వేడి చేస్తే చాలు. పంచదార పూర్తిగా కరిగిన వెంటనే స్టవ్ ఆపేయండి.
-వేడివేడిగా వండిన అన్నంలో, మనం సిద్ధం చేసుకున్న కొబ్బరి పాల మిశ్రమంలో సగాన్ని పోసి బాగా కలపండి. మూతపెట్టి ఒక 15-20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇలా చేయడం వల్ల అన్నం ఆ కొబ్బరి పాల కమ్మదనాన్ని, తీపిని పూర్తిగా పీల్చుకుని మృదువుగా మారుతుంది.
-ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని, అందులో ఈ కొబ్బరి అన్నాన్ని ఉంచండి. మామిడి పండును చెక్కుతీసి, ముక్కలుగా కోసి అన్నం పక్కన అందంగా అమర్చండి. ఇప్పుడు మిగిలిన కొబ్బరి పాలను అన్నంపై నెమ్మదిగా పోయండి. చివరగా, పైన వేయించిన నువ్వులు లేదా డ్రై ఫ్రూట్స్ చల్లితే నోరూరించే థాయ్ స్పెషల్ మామిడి స్టిక్కీ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
