Latest Updates
-
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే..
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఇడ్లీ, దోశ, బోండా, వడ, ఉప్మా.. ఇలా ఏది చేసినా వాటికి అసలైన రుచిని తెచ్చేది మాత్రం వాటితో పాటు వడ్డించే చట్నీ మాత్రమే. మీ ఇంట్లో వాళ్ళు కూడా ప్రతిరోజూ రొటీన్ చట్నీలు తిని బోర్ ఫీల్ అవుతున్నారా? అయితే అరకప్పు వేరుశెనగ గుళ్ళు (పల్లీలు) ఉంటే చాలు.. క్షణాల్లో నోరూరించే పల్లీ చట్నీ తయారు చేయవచ్చు. వేరుశెనగ చట్నీని ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తారు.
కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ రెసిపీ చాలా సులభమైనది, అత్యంత రుచికరమైనది. ఈ పద్ధతిలో ఒక్కసారి చట్నీ చేసి మీ ఇంట్లో వాళ్లకు వడ్డించండి, ఇకపై ఎప్పుడు టిఫిన్ చేసినా ఇదే చట్నీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు. ఈ కమ్మటి పల్లీ చట్నీ తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఎండు వేరుశెనగ గుళ్ళు (పల్లీలు) - అర కప్పు
నూనె - 1 టీస్పూన్
చింతపండు - చిన్న ఉసిరికాయంత
ఎండు మిరపకాయలు - 5
కరివేపాకు - 1 రెమ్మ
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
పసుపు - ఒక చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - చట్నీకి తగినంత
తాలింపు కోసం:
నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపపప్పు - అర టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
ఎండు మిరపకాయ - 1
కరివేపాకు - 1 రెమ్మ
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు!
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. అందులో అరకప్పు పల్లీలు వేసి సన్నని మంటపై దోరగా వేయించండి. పల్లీలు మాడిపోకుండా మంచి సువాసన వచ్చేంతవరకు వేయించి, ఒక పళ్ళెంలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే కడాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలు, చింతపండు, కరివేపాకు వేసి నిదానంగా వేయించండి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి, పళ్ళెంలోకి తీసుకుని చల్లారనివ్వండి.
-ఒక మిక్సీ జార్ తీసుకుని.. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు, చింతపండు, కరివేపాకు వేసి ఒకసారి బరకగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత అందులో పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయండి. దానికి పావు కప్పు నీళ్లు జతచేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు గ్రైండ్ చేసిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్ళు పోసి తొలిపి, ఆ నీటిని కూడా చట్నీలో కలపండి.
-చివరగా చట్నీకి ప్రాణం పోసే తాలింపు కోసం.. స్టవ్ మీద పోపు గరిటె పెట్టి నూనె వేయండి. నూనె కాగాక ఆవాలు, మినపపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. ఈ పోపు చిటపటలాడుతూ మంచి సువాసన వస్తున్నప్పుడు, తీసుకువెళ్లి చట్నీలో వేసి కలపండి.
-అంతే ఎంతో కమ్మటి, రుచికరమైన వేరుశెనగ చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
