Latest Updates
-
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు -
గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఆగస్టు 19 నుంచి ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి! -
జుట్టు రాలడం తగ్గాలంటే.. వారానికోసారి ఈ కరివేపాకు ఎగ్ రైస్ తినాల్సిందే!..లంచ్ బాక్స్ కి బెస్ట్ -
ఇంట్లోనే పక్కా హోటల్ స్టైల్ వెజ్ కుర్మా.. రెస్టారెంట్ చెఫ్ లు వాడే సీక్రెట్ ఇదే! -
ఏ కూరగాయలు, పండ్లు తినాలి? సద్గురు చెప్పిన ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యే ఉండదు! -
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే దొండకాయ రోటీ పచ్చడి.. ఇలా చేశారంటే ఇక కూరల జోలికి వెళ్లరు.! -
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.!
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక!
రవ్వతో చేసే ఉప్మా చాలా త్వరగా, సులభంగా పూర్తవుతుంది. అయితే ఎప్పుడూ ఒకేలాంటి తెల్లటి ఉప్మా తిని విసుగు చెందారా? బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఉప్మాలో రకరకాల కూరగాయలు వేసి తింటున్నప్పటికీ, రోజూ ఒకే రుచి బోర్ కొడుతోందా? కరివేపాకు, వేరుశెనగలు, శనగపప్పు లాంటి పోపు దినుసుల కరకరలాడే రుచితో పాటు, కంటికి ఆకర్షణీయంగా కనిపించే గులాబీ రంగు బీట్ రూట్ ఉప్మాను ఎప్పుడైనా రుచి చూశారా?
మజ్జిగ, బీట్ రూట్ అద్భుతమైన కలయికతో తయారయ్యే ఈ ఉప్మా అమోఘమైన రుచిని అందిస్తుంది. మజ్జిగ కలుపడం వల్ల దీని రుచి రెట్టింపు అవుతుంది. బీట్ రూట్ లోని సహజమైన తీపి, మజ్జిగలోని తేలికపాటి పులుపు కలగలిసి ఉప్మాకు అమోఘమైన రుచిని ఇస్తాయి.

బీట్ రూట్ ఉప్మా తయారీ విధానం
-ఈ ఉప్మా తయారీలో ప్రధానమైనది మజ్జిగ, బీట్ రూట్ మిశ్రమం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తాజా, సాదా మజ్జిగను పోయాలి. దానికి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన బీట్ రూట్ ముక్కలు జతచేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బీట్రూట్ వల్ల మజ్జిగకు అందమైన గులాబీ రంగు వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, అందులో సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిరపకాయల ముక్కలు వేసి పక్కన పెట్టుకోవాలి.
గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే!
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో బొంబాయి రవ్వ (సూజీ) వేసి మంచి వాసన వచ్చే వరకు, మాడకుండా సన్నని మంటపై దోరగా వేయించి పక్కన ఒక ప్లేట్ లో తీసిపెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక ఆవాలు, కొద్దిగా ఇంగువ, శనగపప్పు, వేరుశెనగలు, జీడిపప్పు, ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. అవి కాస్త వేగాక, సన్నగా తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేలా కమ్మగా వేయించుకోవాలి.
-పోపు చక్కగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గులాబీ రంగు బీట్ రూట్-మజ్జిగ మిశ్రమాన్ని బాండీలో పోయాలి. మజ్జిగ కొద్దిగా మరుగుతున్నప్పుడు, ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను నెమ్మదిగా పోస్తూ, ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. మంటను మీడియం నుండి తక్కువగా ఉంచి, రవ్వ బాగా ఉడికేలా చూసుకోవాలి. చివరగా మరో టేబుల్ స్పూన్ నెయ్యి పైన వేసి, ఉప్మా సరైన చిక్కదనం వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే నోరూరించే బీట్ రూట్ ఉప్మా రెడీ. బీట్ రూట్, కూరగాయల పోషకాలు మెండుగా ఉండటం వల్ల, బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో ఈ రుచికరమైన ఉప్మాను నిశ్చింతగా చేర్చుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications