Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
కేవలం 10 నిమిషాల్లో అప్పటికప్పుడు రాగి ఇడ్లీ రెడీ..ఈ పద్ధతిలో చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
పొద్దున్నే ఏది పడితే అది తింటే ఆరోగ్యానికి ఇబ్బంది తప్పదు. హెల్దీగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవాలి. అలాంటివాటిల్లో రాగి ఇడ్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. రాగి ఇడ్లీ అనేది రాగిపిండితో తయారుచేసే ఆరోగ్యకరమైన,రుచికరమైన భారతీయ వంటకం. ఇది సాధారణ ఇడ్లీల కంటే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటది. రాగుల్లో కాల్షియం,ఐరన్, ఫైబర్ ఫుష్కలంగా ఉంటాయి. అలాంటి రాగి పిండితో చేసే ఇడ్లీలు తింటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు.
అయితే రాగి ఇడ్లీలు బయట హోటల్స్ లో ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారు. రెండు రాగి ఇడ్లీలు తినాలంటే రూ.50-60 వరకు ఖర్చు పెట్టాల్సిందే. అయితే మీరు వాటిని సులభంగా 10నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. రాగి ఇడ్లీ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

రాగి ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
-పచ్చి శెనగపప్పు
-ఆవాలు
-జీలకర్ర
-క్యారెట్ తరుగు
-పచ్చిమిర్చి తరుగు
-పుల్లని పెరుగు
-మినపప్పు
-రాగి పిండి
-కరివేపాకు
-కొత్తిమీర
-బొంబాయి రవ్వ
-ఆయిల్
రాగి ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ లేదా గిన్నె పెట్టి అందులో అరటేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చెయ్యాలి.
-వేడెక్కిన నూనెలో 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు,అర టీస్పూన్ ఆవాలు, అరటీస్పూన్ జీలకర్ర వేసి తాళింపుని దోరగా వేయించుకోవాలి.
-తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు,పావు కప్పు క్యారెట్ తరుగు వేసి సన్నని సెగమీద దోరగా వేయించాలి.
-తర్వాత అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి 5-10 నిమిషాల పాటు సన్నని సెగ మీద వేయించండి.
-తర్వాత అందులో 1 కప్పు రాగి పిండి వేసి 2-3 నిమిషాలు వేయించాక అందులో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆపేసి గిన్నెను దించి చల్లారనివ్వాలి.
-కాస్త చల్లబడిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు,2కప్పుల పెరుగు(వీలైతే కొద్దిగా పులిసినది),అవసరమైనమేరకు నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలిపి మూతపెట్టి 10 నిమిషాలు పక్కనపెట్టుకోండి.
-తర్వాత మూత తీసి మళ్లీ బాగా కలిపి అందులో అర టీస్పూన్ వంటసోడా,కొద్దిగా నీళ్లు కావాలనుకుంటే పోసి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలాగే కలుపుకోవాలి.
-తర్వాత ఈ పిండిని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవడమే. అంతే రాగి ఇడ్లీ రెడీ. ఇడ్లీ పాత్రలో ఆయిల్ రాసేదానికి బదులుగా పలుచటి గుడ్డ పరిచి దానిమీద ఇడ్లీ పిండిని పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి ఇడ్లీలు. దూదిలా మెత్తగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications