Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
అరటిదూట పప్పు..సమీరా రెడ్డి చెప్పిన ఈ వంటకంతో ఆరోగ్యానికి పండగే!
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటారు ప్రముఖ నటి సమీరారెడ్డి. ముఖ్యంగా బాడీ పాజిటివిటీ, మైండ్‌ఫుల్ ఈటింగ్, మహిళల ఆరోగ్యం, జీవనశైలికి సంబంధించిన ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.
కడుపుకు హాయినిచ్చే, జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఒక అద్భుతమైన సాంప్రదాయక వంటకాన్ని సమీరారెడ్డి తన ఫాలోవర్లకు పరిచయం చేశారు. అదే అరటిదూట పప్పు కూర. అరటిదూటను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించి, శరీరంలో నీరసాన్ని, అలసటను తగ్గిస్తాయి.

హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడంలో, నెలసరి సమస్యలను దూరం చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ (గట్ హెల్త్)ను మెరుగుపరచడమే కాకుండా, శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి డైట్. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
అరటిదూట - పప్పు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు
అరటిదూట - 1 (శుభ్రం చేసి, సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కందిపప్పు లేదా పెసరపప్పు - పావు కప్పు
పసుపు - ఒక టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
పచ్చిమిర్చి - 1
జీలకర్ర - ఒక టీస్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
ఆవాలు - కొద్దిగా
కాశ్మీరీ ఎండుమిర్చి - 1
నెయ్యి - పోపు కోసం సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
అరటిదూట - పప్పు కూర తయారీ విధానం
-ముందుగా అరటిదూటను శుభ్రం చేసుకుని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. కత్తిరించేటప్పుడు వచ్చే దారాలను తీసేయాలి. ముక్కలు నల్లబడకుండా మజ్జిగ లేదా పసుపు నీళ్లలో వేసి ఉంచాలి.
-ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో కడిగిన పప్పు, అరటిదూట ముక్కలు, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టాలి. దూట లేతదనాన్ని బట్టి సుమారు 6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి.
-ఈలోపు మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి, అందులో నెయ్యి వేడి చేయాలి. అందులో ఆవాలు, కశ్మీరీ ఎండుమిర్చి, కరివేపాకు వేసి కమ్మని వాసన వచ్చేలా పోపు (తాలింపు) పెట్టుకోవాలి.
-ఈ పోపును కుక్కర్ లో ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటిదూట-పప్పు మిశ్రమంలో వేసి కలపాలి. ఆ వెంటనే మిక్సీ పట్టుకున్న కొబ్బరి-జీలకర్ర పేస్ట్‌ను కూడా ఇందులో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మరో రెండు మూడు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే, ఎంతో ఆరోగ్యకరమైన, కడుపుకు తేలికగా ఉండే అరటిదూట పప్పు కూర రెడీ. వేడివేడిగా వడ్డించే ముందు కాసేపు మూతపెట్టి అలాగే వదిలేస్తే పోపు రుచులన్నీ కూరకు పడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
