Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
ఐరన్ గని, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్.. ఎన్నో లాభాలున్న హలీమ్ సీడ్స్ లడ్డూ ఎలా చేసుకోవాలంటే..
జుట్టు విపరీతంగా రాలిపోతోందా? రోజంతా ఏదో తెలియని నీరసం వేధిస్తోందా? రక్తహీనతతో బాధపడుతున్నారా? అయితే వీటన్నింటికీ ఒకే ఒక్క అద్భుతమైన పరిష్కారం మీ వంటగదిలోనే ఉంది. అదే హలీమ్ సీడ్స్ (అలీవ్ గింజలు లేదా గార్డెన్ క్రెస్ సీడ్స్). రోజువారీ ఆహారంలో కేవలం 1 లేదా 2 స్పూన్ల హలీమ్ సీడ్స్ ను చేర్చుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా అందుతుంది.
రక్తహీనత మటుమాయం అవ్వడమే కాకుండా, శరీరానికి రోజంతా కావలసిన న్యాచురల్ ఎనర్జీ (సహజ శక్తి) లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇదొక వరం లాంటిది. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టి కురులు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అలాగే మహిళల నెలసరి సమస్యలను దూరం చేసి, హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో ఈ గింజలు ఎంతగానో సహాయపడతాయి. వీటిని కేవలం నీళ్లలో కాకుండా, కొబ్బరి నీళ్లలో నానబెట్టి.. బెల్లంతో లడ్డూలా చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతాయి.

హలీమ్ సీడ్స్ లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు
హలీమ్ సీడ్స్ - 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నీళ్లు - 1 కప్పు
బెల్లం తురుము - 2 కప్పులు
ఎండు కొబ్బరి తురుము - అర కప్పు
బాదం పప్పులు - పావు కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
స్వచ్ఛమైన నెయ్యి - 1 నుండి 2 టేబుల్ స్పూన్లు
సండే స్పెషల్: నోరూరించే ఎగ్ ఘీ రోస్ట్ మసాలా..నాలుకకి పండగే పండగ..వేళ్లు నాక్కుంటూ తినేస్తారు!
హలీమ్ సీడ్స్ లడ్డూ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల హలీమ్ సీడ్స్ తీసుకుని, అందులో ఒక కప్పు కొబ్బరి నీళ్లు పోసి కనీసం 2-3 గంటల పాటు నానబెట్టాలి. కొబ్బరి నీళ్లలో నానడం వల్ల ఈ గింజల పోషక విలువలు, రుచి రెట్టింపు అవుతాయి. గింజలు నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి.
-స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక, నానబెట్టుకున్న హలీమ్ సీడ్స్ మిశ్రమాన్ని వేసి సన్నని మంట మీద రెండు నిమిషాలు వేయించాలి.
-ఆ తర్వాత అందులో 2 కప్పుల బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం కరిగి, పాకం లాగా వస్తూ మిశ్రమం నెమ్మదిగా దగ్గర పడుతుంది.
-మిశ్రమం కాస్త గట్టి పడుతున్న సమయంలో.. ఎండు కొబ్బరి తురుము, క్రష్ చేసిన బాదం పప్పులు, సువాసన కోసం యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మిగిలిన నెయ్యి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఈ మిశ్రమం గోరువెచ్చగా అయిన తర్వాత, చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ మీకు నచ్చిన సైజులో గుండ్రటి లడ్డూలుగా చుట్టుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, పోషకాలతో నిండిన హలీమ్ సీడ్స్ లడ్డూలు రెడీ.
-రోజూ ఉదయం లేదా సాయంత్రం స్నాక్ లాగా ఒక్క లడ్డూ తింటే చాలు.. క్రమక్రమంగా మీ జుట్టు ఆరోగ్యంలో, మీ శరీరంలోని శక్తిలో వచ్చే అద్భుతమైన మార్పును మీరే గమనిస్తారు
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
