Latest Updates
-
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే?
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ!
రైస్, చపాతీ, పూరీ దేంట్లోకి తిన్నా అద్దిరిపోయే టేస్ట్ కావాలంటే బంగాళదుంప ముద్ద కూర ట్రై చేసి చూడండి. ఒక్కసారి ఈ కూర టేస్ట్ చేశారంటే..ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది. బంగాళదుంప ముద్ద కూర తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-బంగాళదుంపలు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-అల్లం
-వెల్లుల్లి
-తాలింపు గింజలు
-ఉప్పు
-పసుపు
-కరివేపాకు
-కొత్తిమీర
-నూనె
ధనియాల పొడి

తయారీ విధానం
-ముందుగా అరకేజీ బంగాళదుంపలను శుభ్రంగా కడగాలి.
-తర్వాత ఒక కుక్కర్ లో కడిగిన బంగాళదుంపలు వేయండి, ఇందులోనే 1 గ్లాసు నీళ్లు, 1 టీస్పూన్ ఉప్పు వేసి కుక్కర్ మూతపెట్టేయండి. దీనిని స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
-తర్వాత ఉడికిన బంగాళదుంళల మీద తొక్క తీసేసి బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత మిక్సీ జార్ లో 8 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, 7 పచ్చిమిరపకాయలు వేసి ఈ మొత్తాన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. లేదా రోట్లో అయినా దంచుకోవచ్చు.
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు!
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు(ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు) వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడేంతవరకు వేగిన తర్వాత అందులోనే 3 ఎండుమిరపకాయలను తుంచి వేయండి, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసి అది కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత అందులో చిటికెడు ఇంగువ వేసి కలిపిన తర్వాత అందులో 1 ఉల్లిపాయ పొడవాటి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు, కరివేపాకు వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులోనే అర టీస్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి తక్కువ మంద మీద బాగా కలుపుతూ 3 నిమిషాలు వేయించాలి. ముద్దకూరలా వచ్చినప్పుడు అందులో 1 టీస్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. చివరగా అందులో కొంచెం కొత్తిమీర కలుపుకొని దించేయండి.
-అంతే బంగాళదుంప ముద్ద కూర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
