Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఆమ్ కా పన్నా ట్రై చేయండి..టేస్ట్ చేయండి.
ఎండలో కాసేపు అలా బయటికెళ్లి ఇంటికి రాగానే చల్లగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తోంది. ఇలాంటప్పుడే మనసు శీతలపానీయాలవైపు లాగుతూ ఉంటుంది. నిమ్మరసం, మజ్జిగ ఎప్పుడూ తాగేవే. కాస్త వెరైటీగా ఇంకేదైనా అనుకునే వారికోసం ఇంట్లోనే పండ్లు మరియు కూరగాయలతో తయారు చేసుకోవచ్చు.
వేసవిలో ఆకలి వేస్తున్నట్టుంటుంది, తినలేము. దప్పిక రేగిపోతుంటుంది, తాగలేము. నీరసం.... నీ...రసం. కొంచెం రిఫ్రెష్ బటన్ నొక్కి మనసును, శరీరాన్ని జిల్ జిల్‌మనిపించేలా
ఏదైనా తిని, తాగాలనిపిస్తుంది. అటువంటి సమయంలో చల్ల..చల్లగా .. మీ నోటికి అందాలి ఆమ్ కా రస్నా. ఇది ఒంట్లో వేడిని చల్లబరిచి, తేలికగా అరిగిపోయే డ్రింక్ ట్రై చేయండి. టేస్ట్ చేయండి.

కావలసిన పదార్థాలు:
మామిడికాయలు: 2
బెల్లం: 150 గ్రా
జీలకర్ర: 1tsp(వేయించి, పొడి చేయాలి)
ఉప్పు: రుచికి తగినంత
నీళ్లు: 1/2lts
బ్లాక్ సాల్ట్: 1tsp
మ్యాంగో ఎసెన్స్: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా మామిడికాయలను కడిగి, తగినంత నీరు పోసి ఉడికించాలి.
2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రింది దించి చల్లార్చుకోవాలి.
3. చల్లారిన తర్వాత, గుజ్జు తీసి, మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి.
4. ఇప్పుడు నీళ్లలో బెల్లం, ఉడికించిన మామిడికాయ గుజ్జు, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
5. గాజు గ్లాసులో పోసి సర్వ్ చేయాలి. ఈ పానీయాన్ని సేవించడం వల్ల శరీరంలో వేడి, అతిదాహం తగ్గుతాయి.



Click it and Unblock the Notifications