Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఆలూ కచోరి!

బంగాళా దుంపలు : 250 grms
మొక్క జొన్న పిండి : 50 grms
కొబ్బరి తురుము : 200 grms
నూనె : 25 grms
పంచదార : 50 grms
నిమ్మరసం : 1 tsp
పచ్చిమిరపకాయలు : 8
నూనె : వేయించడానికి తగినంత
ఉప్పు : రుచికి సరిపడ
తయారు చేయు విధానము:
1. ముందుగా బంగాళాదుంపలను ఉడికించి, పై పొట్టు తొలగించి చిదిమి పెట్టుకోవాలి.
2. చిదిమిన బంగాళాదుంపకి మొక్క జొన్న పిండి, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
3. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేసి పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, కొత్తిమిర, నిమ్మ రసం, పంచదార, ఉప్పు వేసి కాసేపు వేయించాలి.
4. ముందుగా తయారు చేసి పెట్టుకొన్న బంగాళాదుంప మిశ్రమాన్ని అరచేతిలో ఉంచుకొని వాటిని గుండ్రంగా చేసి కొద్దిగా నొక్కి మధ్యలో కొబ్బరి తురుము మిశ్రమాన్ని పెట్టి చుట్టేయాలి.
5. పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఒక్కొక్కటి తీసుకొని నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఇక ఆలు కచోరీ రెడీ.



Click it and Unblock the Notifications