Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బంగాళదుంప-పెసరపప్పు పకోడా
వర్షాకాలం మన మూడ్ ను చాలా వరకూ మార్చేస్తుంది. ఎలాగ అంటారా? త్వరగా నిద్రలేవనివ్వదు, వర్షానికి బయట కాలు పెట్టనివ్వదు, ఏమి తిన్నా రుచిగా అనిపించదు..ఇలాంటివి మరికొన్ని..ముఖ్యంగా వర్షానికి వేడి వేడి, కొంచెం కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. వానపడుతున్నప్పుడు, క్రిస్పీగా, స్పైసీగా తినాలనిపించే స్నాక్స్ తో పాటు ఒక కప్పు టీ, కాఫీ చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
అలాంటి మాన్ సూన్ స్నాక్ మీరూ తినాలనుకుంటున్నారా?అలాంటి వాటిల్లో ఒకటి క్రిస్పీ పకోడా ఒకటి, గ్రిల్డ్ కబాబ్స్, హోం మేడ్ చాట్స్ లేదా కట్ లెట్స్ చాలా ఫేమస్. మనం అందరం ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకు చాలా వర్క్ అవుట్స్ చేస్తాం. కానీ వర్షాకాలంలో మాత్రం వీటికి చెక్ పెట్టేసి, ఎంచక్కా మనకు నచ్చిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతాం..కాబట్టి మీకు ఇష్టమైన మాన్ సూన్ స్నాక్ రిసిపిని ట్రై చేయండి...టేస్ట్ చేసి, ఎంజాయ్ చేయండి..

కావల్సిన పదార్థాలు:
మూంగ్ దాల్(పెసరపప్పు): 1cup
బంగాళ దుంపలు : 2(ఉడికించిన)
ఉల్లిపాయ : 1(చిన్న ముక్కలుగా కత్తిరించాలి)
పచ్చిమిరపకాయలు: 2(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం: 1tbsp(తురుముకోవాలి)
కొత్తిమీర: 1tsp(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
జీలకర్ర(zeera): 1tsp
ఇంగువ (హింగ్): ఒక చిటికెడు
బేకింగ్ సోడా: ఒక చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పెసరపప్పును నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయం నీరు వంపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2. తర్వాత బంగాళదుంపలను ఉడికించుకొని, చిదిమి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించి మెత్తగా చేసుకొన్న బంగాళదుంప, గ్రైండ్ చేసుకొన్న పెసరపప్పు, మిగిలిన పదార్థాలన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
3. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు చేర్చుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని పకోడాలా గుండ్రంగా చేసుకోవాలి.
4. ఇప్పడు స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి, అందులో గుండ్రా చుట్టుకొన్న పకోడాలను వేసి, అతి తక్కువ మంట మీద పకోడాలను వేగించుకోవాలి.
5. పకోడా బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేగించుకొని, పక్కకు తీసి, పేపర్ టవల్ మీద వేసి అదనపు నూనెను తీసివేయాలి.
6. ఈ వేడి వేడి మూంగ్ దాల్ ఆలూ పకోడాను వేడి వేడిగా పుదీనా చట్నీ లేదా కెచప్ తో సర్వ్ చేయాలి. అంతే మూంగ్ దాల్ ఆలూ పకోడా రెడీ. వర్షాకాలంలో ఒక కప్పు వేడి వేడి కాఫీ లేదా టీ తో పకోడాను సర్వ్ చేయండి.



Click it and Unblock the Notifications