Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
అరటికాయ బజ్జీ : ఉగాది స్పెషల్
అరటికాయ బజ్జీ ఆంధ్రవంటలలో ఒక కారపు వంటకం. అరటితో రకరకాలైన వంటకాలు చేసుకోవచ్చు. అరటి కూర,అరటి వేపుడు, అరటి బజ్జీ మెదలైనవి. అరటితో అల్పాహారాలు, అరటి పండు రసాలు కూడా చేసుకోవచ్చు. బనానా చిప్స్ అనునది అరటి కాయ నుండి తయారు చేయు ఓ అల్పాహారం. ఇది ప్రపంచ వ్యాప్తంగా బహు ప్రసిద్ధి. కేరళ వాళ్ళు వీటిని కొబ్బరి నూనెతో వేయించి తయారు చేస్తారు. అవి ఓ ప్రత్యేకమైన వాసన, రుచి కలిగి ఉంటాయి. అరటి పండ్లను జాం తయారు చెయ్యడంలో కూడా ఉపయోగిస్తారు. అరటి పండ్లను పండ్ల రసాలు తయారు చేయడం లోనూ, ఫ్రూట్ సలాడ్ లలోనూ, ఉపయోగిస్తారు.
అరిటికాయ బజ్జీలు ఒక రకంగా ఒక స్ట్రీట్ ఫుడ్ అనే చెప్పవచ్చు. వీటికి అంత క్రేజ్ ఉంది. బ్రౌన్ కలర్ లో వేడి వేడిగా నోరూరిస్తూ మనల్ని ఆకర్షిస్తుంటాయి. ఈ అరిటికాయ బజ్జీలు ఏసందర్భంలోనైనా తయారుచేసుకోవచ్చు. అలాగే స్పెషల్ అకేషన్స్ లోనూ తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా పండుగలకు కూడా అరిటికా బజ్జీలను తయారుచేస్తారు. అందుకే ఉగాది రోజును పులిహోరాకు ఒక రుచికరమైన గ్రేట్ సైడ్ డిష్ గా అరిటికాయ బజ్జీలను తయారుచేసి, ఇంటిల్లి పాదిని ఆనందపరచండి . మరి వీటిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
పచ్చిఅరటి కాయలు: 2 లేదా 3(పొట్టు తీసి, పలుచగా కావల్సిన ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి)
శెనగపిండి: 2cup
బియ్యం పిండి: 1tbsp
కారం: 1tsp
బేకింగ్ సోడా : చిటికెడు
అజ్వైన్(వామ్ము): 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో, శెనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, వాము, బేకింగ్ సోడా మరియు సరిపడా నీళ్ళు పోసి మరీ చిక్కగా, మరీ పల్చగా కాకుండా మీడియంగా కలిపి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి, వేడయ్యాక మంటను మీడియం తగ్గించి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ముందుగా పలచగా చక్రల్లా కట్ చేసి పెట్టుకొన్నపచ్చి అరిటికాయ ముక్కలను శెనగపిండి మిశ్రమంలో డిప్ చేసి అన్ని వైపులా శెనగపిండి అంటేలా డిప్ చేయాలి.
4. శెనగపిండిలో డిప్ చేసిన అరిటికాయ బజ్జీలను కాగుతున్న నూనెలో 4-6 వరకూ వేసి(సైజును బట్టి, కాగేనూనెలో వేయాలి) అవి బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ వేగించుకోవాలి.
5. బజ్జీలు నూనెలో వేగుతున్నప్పుడు కాస్త మంటను పెంచుకోవచ్చు. అప్పుడు లోపలి భాగం కూడా పూర్తిగా ఉడుకుతుంది. అరటికాయ బజ్జీలు బ్రౌన్ కలర్ లోనికి మారగానే వాటిని తీసి నూనె పీల్చుకొనే పేపర్ మీద ఒకటి రెండు నిముషాలు వేసి తర్వాత వెంటనే సర్వ్ చేయాలి. అంతే అరిటికాయ బజ్జీ రెడీ.



Click it and Unblock the Notifications