Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
బోన్ లెస్ మటన్ కబాబ్-మాన్ సూన్ స్పెషల్
కబాబ్ అంటే గతంలో మటన్‌తో చేసేది అని అర్థం. ఇప్పుడు చికెన్ కబాబ్... ప్రాన్స్ కబాబ్ అని రకరకాల కబాబులు రెడీ అయిపోతున్నాయి. పూర్తి స్థాయి వంట చేసుకోవడానికి వీల్లేని రోజుల్లో సైనికులు మాంసాన్ని ఎండబెట్టి దాచుకొని అప్పటికప్పుడు నిప్పుల్లో కాల్చుకొని తినేవారు. ఈ ఎండు మాంసమే కబాబ్ మారింది. ఇప్పుడు ఇన్‌స్టాంట్ కబాబులు వడ్డిస్తున్నారు. నాన్‌వెజ్‌లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువా కాకపోయినా కబాబ్‌లకు రాచరికపు హోదా దక్కింది. కబాబ్‌లు వడ్డించారంటే అదో పెద్ద హోదా కిందే ఇప్పటికీ.
కబాబ్ ను ఏ సందర్భంలోనైనా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో వేజిటేరియన్ స్నాక్స్ తో పాటు, కబాబ్ లు కూడా చాలా ప్రసిద్ధి. వర్షాకాలంలో నోటికి రుచికరంగా వేడి వేడిగా కబాబ్ తింటే ఎలా ఉంటుంది. చాలా మందికి మాంసాహార ప్రియులు కబాబ్ లను ఇష్టపడుతారు. ఈ వర్షాకాలంలో మీరు కూడా ఈ మటన్ కబాబ్ ను రుచిని వెరైటీగా తిని ఆనంధించండి..

కావలసిన పదార్థాలు:
కీమా మటన్: 1/2kg
ఉల్లిపాయ:1
అల్లం వెల్లుల్లి పేస్టు: 2tsp
పచ్చిమిర్చి: 3-4
కొత్తిమీర తరుగు: 3tbsp
పచ్చిబొప్పాయి పేస్టు: 3tbsp
కారం: 1tsp
యాలకులు: 8
మిరియాలపొడి: 1tsp
గరం మసాల: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
నిమ్మరసం: అరచెక్క
చాట్ మసాల: 1tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా కీమాను శుభ్రంగా కడిగి నీరు లేకుండా పిండేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక పాత్రలో కీమాతో పాటు మిగతా పదార్థాలన్నీ వేసి ముద్దలా కలిపి ఒక ప్లాస్టిక్ కవర్ కప్పి గంటసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.
3. ఈ లోపుగా వెదురు పుల్లల్ని నీటిలో నానబెట్టుకోవాలి.
4. తర్వాత చేతి గుప్పిటనిండా కీమా మిశ్రమాన్ని తీసుకొని (8 అంగుళాల పొడవు అంగుళం చుట్టుకొలతతో) పుల్లకు పట్టించాలి.
5. అవసరమనుకుంటే నూనె పూసి బొగ్గులపై తిప్పుతూ దోరగా కాల్చుకోవాలి. వేడివేడిగా పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటాయి. లేదా చికెన్ స్టీక్ కు కుచ్చి, నూనె చిలకరించి ఓవెన్ లో బేక్ చేసుకోవచ్చు.
అంతే ఈవెనింగ్ స్నాక్ గా వీటిని సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications