Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
సాండ్ విచ్ - క్యారట్ మంచూరియన్
బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడానికి క్యారట్స్‌లో కొలవాలి. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే గంటకో క్యారట్ తినాలి. క్యారట్స్‌లో పోషకాలు పుష్కలం. కంటికి, ఒంటికి మేలు చేసే గుణాలు మెండు. రోజూ వంటలోకి ఓ క్యారట్ తురిమి వేయండి. ఇంకో క్యారట్‌ను తరిగి వండండి. నూనెలో వేసి డీప్ ఫ్రై చేయండి. వేయించకుండానే పెరుగులో కలిపేయండి. దేనికది భిన్నమైన టేస్ట్ అంటూ లొట్టలు వేయంచండి. క్యారట్‌తో వివిధ రకాల వెరైటీలు వండుతారు. అందులో ఒకటి కొత్తరకం వంటకం క్యారెట్ మంచూరియన్.
తినడానికి టేస్ట్ గా స్పైసీగా..చూడటానికి నోరూరించే క్యారెట్ మంచూరియన్ తయారు చేయడం చాలా సులభం. మరియు ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది. మరి పోషకాల శరీరానికి మెండుగా అందాలంటే క్యారెట్ ను రెగ్యులర్ గా ఏదో ఒక రూపంలో తీసుకోవాల్సిందే..క్యారెట్ తో ఓ వెరైటీ వంటకం క్యారెట్ మంచూరియన్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
తురిమిన క్యారట్: 1cup
శనగపిండి: 2cups
కార్న్‌ఫ్లోర్: 1tbsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
కారం: తగినంత
వాము: చిటికెడు
పోపు కోసం:
నూనె: కొద్దిగా
ఉల్లిపాయ తరుగు: 1tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1/2tsp
సోయాసాస్: 1tsp
టొమాటో సాస్: 1tsp
కొత్తిమీర తరుగు: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో తురిమిన క్యారట్, శనగపిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లిపేస్ట్, ఉప్ప, కారం, వాము వేసి కలపాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి, ముద్ద చేసుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో నూనె పోసి వేడి చేయాలి.
3. ఇప్పుడు పిండి ముద్దలు తీసుకొని, చిన్న చిన్న ఉండలు చేసి, కాగుతున్న నూనెలో వేసి అన్ని వైపులా బంగారురంగు వచ్చేవరకు వేయించి తీయాలి.
4. మరొక పాన్ మరికొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లిపాయలు వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయాసాస్, టొమాటో సాస్ వేసి గ్రేవీలాగా చేయాలి.
5. తర్వాత వేయించిన క్యారట్ మంచూరియాలను అందులో వేసి బాగా మిక్స్ చేసి పక్కకు దింపుకోవాలి.
6. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే క్యారెట్ మంచూరియన్ రెడీ .



Click it and Unblock the Notifications