Latest Updates
-
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి!
చికెన్ కట్ లెట్: కేరళ స్టైల్ స్నాక్ రిసిపి
చికెన్ కట్ లెట్ ఒక సులభమైన మరియు రుచికరమైన స్నాక్ రిసిపి. ముఖ్యంగా ఇటువంటి స్నాక్ రిసిపి ఈవెనింగ్ స్నాక్ గా అద్భుతంగా ఉంటుంది. అయితే దీన్ని మీరు వెస్ట్రన్ స్నాక్ గా భావించకండి. వివిధ రకాల ఇండియన్ చికెన్ కట్ లెట్స్ లో ఇది కూడా ఒకటి. మన ఇండియన్స్ కు నచ్చిన విధంగా మన ప్లేట్స్ లో రుచికరంగా వండించాలంటే, ఈ కేరళ స్టైల్ చికెన్ కట్ లెట్ రిసిపిని ప్రయత్నించాల్సింది.
దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు క్రిస్పీ మరియు స్పైసీగా ఉండే ఈ ఈవెనింగ్ స్నాక్ చికెన్ కట్ లెట్ ను కేరళీయుల స్పెషల్ ఎందుకంటే, చికెన్ ఖీమా మరియు బంగాళదుంపతో తయారుచేస్తారు. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు జోడించడం వల్ల సౌత్రన్ ఫ్లేవర్ ను అందిస్తూ, ఘుమఘుమలాడుతుంటుంది . మరి ఈ సింపుల్ అండ్ క్రిస్పీ చికెన్ కట్ లెట్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
ఉడికించిన చికెన్ ఖీమా: ½ kg
బంగాళదుంపలు: 2(ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి)
పెప్పర్: 1tsp
గరం మసాలా: 1tsp
పచ్చిమిర్చి :2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం: ½ అంగుళం (తురుముకోవాలి)
గుడ్డు: 1(బీట్ చేసి పెట్టుకోవాలి)
బ్రెడ్ పొడి: 1cup
కరివేపాకు: 2-3 రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1cup
తయారుచేయు విధానం :
1. ముందుగా చికెన్ మరియు ఉడికించి చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపలను తీసుకోవాలి. రెండింటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
2. తర్వాత అందులో అల్లం, పచ్చిమిర్చి, గరం మసాలా, పెప్పర్ పౌడర్, కరివేపాకు మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి.
3. తర్వాత అందులోనే మసాలాలను కూడా జోడించి తిరిగి మిక్స్ చేసుకోవాలి.
4. ఇలా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకొన్న తర్వాత అందులోను నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని కట్ లెట్ లా ఒత్తుకోవాలి.
5. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి బాగా కాగిన తర్వాత, బీట్ చేసిన గుడ్డులో కట్ లెట్ ను డిప్ చేసి తర్వాత బ్రెడ్ పొడిలో అన్ని వైపులా పొర్లించాలి.
6. ఇప్పుడు ఈ కట్ లెట్స్ ను కాగే నూనెలో వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
7. దాదాపు 10-15నిముషాలు డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
8. వేగిన తర్వాత వీటిని టిష్యు పేపర్ మీద వేసి నూనె పీల్చుకొన్న తర్వాత , సర్వింగ్ ప్లేట్ లో సర్ధి, సలాడ్ మరియు సాస్ తో సర్వ్ చేయాలి. అంతే కేరళ స్టైల్ చికెన్ ఖీమా కట్ లెట్ రెడీ.



Click it and Unblock the Notifications