Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే..
ఉదయం పూట హడావిడిలో ఆరోగ్యకరమైన, అదే సమయంలో రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ చేయడం ప్రతి ఇల్లాలు ఎదుర్కొనే పెద్ద సవాలు. ఎప్పుడూ తినే ఇడ్లీ, దోశలు బోర్ కొట్టినప్పుడు ఏదైనా కొత్తగా, నోటికి రుచిగా తినాలనిపించడం సహజం. అలాంటి సమయంలో మీకు బెస్ట్ ఆప్షన్ పనీర్ పెసర దోశ. పనీర్, పెసరపప్పు ఈ రెండూ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే.

పెసరపప్పులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటే, పనీర్ లో క్యాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఈ రెండింటి కలయికతో చేసే ఈ దోశ రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా, శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది.
పనీర్ పెసర దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు (తొక్క తీసినది) - ఒక పెద్ద కప్పు
తాజా పనీర్ - 100 గ్రాములు
ఉల్లిపాయ - 1
టమాటో - 1
పచ్చిమిర్చి - 3
అల్లం - 2 చిన్న ముక్కలు
ఎండు కారం - 1 టీస్పూన్
తాజా కొత్తిమీర ఆకులు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
వంట నూనె - కాల్చడానికి సరిపడా
పనీర్ పెసర దోశ తయారీ విధానం
-ముందుగా పెసరపప్పును నీటిలో రెండుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత దానికి తగినన్ని నీళ్లు పోసి సుమారు 2 నుండి 3 గంటల పాటు నానబెట్టాలి.
-పప్పు నానిన తర్వాత, నీటిపై ఏవైనా పొట్టు లాంటివి తేలుతుంటే వాటిని తీసి పారబోయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన పెసరపప్పు, ఒక అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి వేసి మెత్తని దోశ పిండిలా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి. పనీర్ ను చేత్తో బాగా మెత్తగా పొడిలా (తురుములా) చేసుకోవాలి. అలాగే టమోటాలు, ఉల్లిపాయ, మిగిలిన పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరను వీలైనంత సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
-ఒక గిన్నెలో మెత్తగా చేసిన పనీర్, సన్నగా తరిగిన కూరగాయల ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు చల్లి బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పిండిలో కూడా రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ ఎండు కారం వేసి కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి వేడి చేయండి. దానిపై కొద్దిగా నూనె రాసి, పెసరపప్పు పిండిని గరిటతో తీసుకొని దోశలాగా గుండ్రంగా పలచగా పరుచుకోవాలి. ఒక వైపు ఎర్రగా కాలిన తర్వాత, మెల్లగా రెండో వైపుకు తిప్పండి. అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేయండి. కింద వైపు ఉడుకుతున్న సమయంలోనే, పైన సిద్ధం చేసుకున్న పనీర్ మిశ్రమాన్ని సమానంగా పరచండి.
-రెండు వైపులా బాగా కాలి, మంచి సువాసన వస్తున్నప్పుడు దోశను సగానికి మడవండి. మరోసారి తేలికగా రెండు వైపులా కాల్చితే, ఎంతో కమ్మని పనీర్ పెసర దోశ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications