Latest Updates
-
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.!
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి!
హిందూ పంచాంగంలో పౌర్ణమి తిథికి ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష పౌర్ణమికి అత్యంత పవిత్రమైన, ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనినే వైశాఖ పౌర్ణమి అని, బుద్ధ పౌర్ణమి అని కూడా భక్తిశ్రద్ధలతో పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు తన పదహారు కళలతో సంపూర్ణ తేజస్సుతో ప్రకాశిస్తాడు.

ఆ వెన్నెల కిరణాలు నేరుగా మనిషి మనస్సుపై, భవిష్యత్తుపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఎప్పటినుంచో తీరని సమస్యలతో సతమతమవుతున్నారా? లేదా మనసులో బలంగా నాటుకుపోయిన కోరిక ఏదైనా ఉందా? అయితే వైశాఖ పౌర్ణమి రాత్రి జ్యోతిష్య శాస్త్రం సూచించిన ఈ అద్భుత పరిహారాలు పాటిస్తే మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి.
ఈ ఏడాది అంటే 2026 వైశాఖ పౌర్ణమి మే 1న జరుపుకుంటారు. పౌర్ణమి తిథి ఏప్రిల్ 30న రాత్రి 9: 12 గంటల సమయంలో ప్రారంభమై మే 1వ తేదీ రాత్రి 10:52 గంటల సమయంలో ముగుస్తుంది.
ఆర్థిక ఇబ్బందులు తొలిగి, ధనప్రాప్తి కోసం
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పౌర్ణమి రాత్రిని మించిన పవిత్రమైన సమయం మరొకటి లేదు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ రోజు రాత్రి పూజా సమయంలో ఒక ఎర్రటి పట్టు వస్త్రాన్ని తీసుకోండి. అందులో 11 గవ్వలను ఉంచి, వాటికి భక్తితో పసుపు, కుంకుమలతో తిలకం దిద్దండి. ఆ గవ్వల మూటను సాక్షాత్తూ సిరిసంపదల అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి పాదాల చెంత ఉంచి మనస్ఫూర్తిగా పూజించండి.
మరుసటి రోజు ఉదయం ఆ గవ్వల వస్త్రాన్ని తీసుకెళ్లి మీ ఇంట్లోని బీరువాలో లేదా డబ్బులు దాచుకునే ప్రదేశంలో (సేఫ్ లో) భద్రంగా పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది, వృధా ఖర్చులు పూర్తిగా తగ్గిపోయి ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
మానసిక ప్రశాంతత కోసం చంద్రుడికి అర్ఘ్యం
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు కారకుడిగా భావిస్తారు. జాతకంలో చంద్ర దోషం ఉన్నవారు, తరచుగా మానసిక ఒత్తిడి, ఆందోళనలతో బాధపడేవారికి ఈ పౌర్ణమి ఒక వరం. వైశాఖ పౌర్ణమి రాత్రి నిండు చందమామకు అర్ఘ్యం సమర్పించాలి. ఒక పాత్రలో గంగాజలం లేదా స్వచ్ఛమైన నీరు తీసుకుని, అందులో కొద్దిగా పచ్చి పాలు, విరగని బియ్యపు గింజలు (అక్షతలు) వేసి చంద్రునికి జల సమర్పణ చేయాలి.
ఈ అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించాలి. ఈ పరిహారం వల్ల మానసిక ప్రశాంతత చేకూరడమే కాకుండా, మీలో ఆకర్షణ శక్తి రెట్టింపు అవుతుంది.

పితృదోషాల నివారణకు రావి చెట్టు పూజ
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టులో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానమాచరించి రావి చెట్టు మొదట్లో (వేళ్లకు) స్వచ్ఛమైన నీటిని సమర్పించాలి. ఆ తర్వాత సాయంత్రం వేళ అదే రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న పితృ దోషాలు శాంతిస్తాయి. ఇంట్లో ఉండే కుటుంబ కలహాలు, మనస్పర్థలు తొలగిపోయి ఆనందం వెల్లివిరుస్తుంది.
ఇంటికి రక్షాకవచంగా తులసి పూజ
హిందువుల ప్రతి ఇంటా కొలువై ఉండే సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం తులసమ్మ. వైశాఖ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో తులసి కోట ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అనంతరం భక్తిశ్రద్ధలతో తులసి మాత చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేస్తూ నమస్కరించుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ నశించిపోతుంది. తులసి మాత ఆశీస్సులతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వృద్ధి చెంది, కుటుంబమంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది.
Diclaimer: మతవిశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని బోల్డ్ స్కై తెలుగు ధృవీకరించలేదు. దీనిని నమ్మడం వ్యక్తిగత విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications