Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
చికెన్ పట్టీస్- క్రిస్పీ స్నాక్
సాధారణంగా సాయంత్రంలో ఏదో ఒక చిరుతిండ్లు తినాలనిపిస్తుంది అందరికీ.. అయితే ప్రతి రోజూ తినేటివే తిని.. తిని బోర్ కొడుతుంటుంది కొందరికి. అలాంటివారిలో మాంసాహార ప్రియులు ఉంటే కనుక ఈ ఈవెనింగ్ క్రిస్పి స్నాక్ మంచి రుచిగా ఉంటుంది. ఈ స్నాక్ రోజులో ఎప్పుడైనా తినవచ్చు. వేడి వేడి కాఫీ లేదా ఏదేని బెవరేజ్ కూడా మంచి కాంబినేషన్. ఘుమఘుమలాడే చికెన్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ ప్రియులందరూ ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్థాలు:
మైదా: 3-4cups
చికెన్: 1/2kg(చిన్నముక్కలుగా కట్ చేసినవి)
నెయ్యి: 1/2cup
గుడ్లు: 2-3
పంచదార: 1tsp
బేకింగ్ సోడ: 2tsp
ఉల్లిపాయలు: 1cup(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి: 4-6(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
క్యారెట్స్: 1/2cup(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
పచ్చిబఠాణీ: 1/2cup
కారం: 2tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
ధనియా పౌడర్: 1tbsp
పసుపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1-2cup(వేయించడానికి సరిపడా)
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి వేసి, అందులో నెయ్యి, గుడ్డు, పంచదార మరియు కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తూ కొద్దిగా నీళ్ళు చేర్చి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. పది నిముషాల తర్వాత పిండిలో కొంత బాగాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసి పూరీల్లా వత్తుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో చికెన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్, పచ్చిబఠాణీ, వేసి తక్కువ మంట మీదా మెత్తబడేవరకూ వేయించాలి.
3. ఇప్పుడు అందులోనే కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. ఉప్పు కూడా చేర్చి, కొద్దిగా నీళ్ళు వేసి చికెన్, పచ్చిబఠానీ మెత్తగా ఉడికేంత వరకూ ఉడికించుకోవాలి. నీరంత పూర్తి ఇమిరి పోయి, చికెన్ మెత్తబడ్డాక క్రిందికి దింపుకోవాలి.
4. తర్వాత ఈ చికెన్ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకొని చిన్న చిన్న చపాతీలో పెట్టి కజ్జీకాయల్లా వత్తుకోవాలి. లోపలున్న స్టఫింగ్ మిశ్రం బయటకు రాకుండా జాగ్రత్త పడాలి.
5. ఇలా అన్నీ తయారు చేసుకొన్న తర్వాత వాటి కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి. అంతే ఈవెనింగ్ క్రిస్పీ చికెన్ పట్టీస్ రెడీ.. వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications