Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
చాక్లెట్ చిప్ కుకీస్-చిల్డన్స్ డే స్పెషల్
హ్యాపీ చిల్డ్రన్స్ డే... ఈ రోజు బాలల దినోత్సవం. ఈ రోజు పిల్లలంతా చాలా ఉత్సహాంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు పిల్లలను మరింత ఉత్సహాంగా ఉండటం కోసం వారికి ఇష్టమైన మిఠాయిలు పంచుతూ వారికి ఇష్టమైన వంటలను వండి పెడితే వారు చాలా సంతోషిస్తారు. పిల్లలకోసం ఈ చిరుతిండి తయారు చేసి చూడండి..

కావలసిన పదార్థాలు:
మైదా లేదా గోధుమపిండి: 1.5cups
వెన్న: 1/2cup
పంచదార: 1cup
కోకో పౌడర్: 6tsp
చాక్లెట్ చిప్స్: 1cup
వెనిలా ఎసెన్స్: 1tsp
వంటసోడా: చిటికెడు
బేకింగ్ పౌడర్: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా మైదా లేదా గోధుమపిండిలో వంటసోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి.
2. తర్వాత ఒక పాత్రలో వెన్న, పంచదార కలిపి గిలకొట్టాలి. ఇందులో పిండి, వెనిలా ఎసెన్స్, కోకో పౌడర్ వేసి కలిపిర తర్వాత చాకో చిప్స్ వేసి మెల్లిగా కలపాలి.
3. చపాతీ పిండిలా తయారయిన ఈ మిశ్రమంతో చిన్నచిన్న ఉండలు చేసి వాటిని కాస్త వెడల్పుగా ఒత్తి, వెన్న రాసిన వెడల్పాటి టిన్నులో వరుసగా పేర్చి ముందే వేడి చేసుకున్న ఓవెన్‌లో 220 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 20 నిముషాలు బేక్ చేయాలి.
సూచన: ఓవెన్ లేని వారు... కుకీస్‌ను తయారు చేసుకున్న తరవాత కుకర్ కింది భాగంలో వెన్న రాసి వీటిని వరసగా పేర్చి సన్నని సెగమీద 40 నిముషాలు ఉంచి దింపేయాలి. విజిల్ పెట్టకూడదు.



Click it and Unblock the Notifications