Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
క్రిస్మస్ బన్నీ కేక్

మైదాపిండి - 200 గ్రాములు
పంచదారపొడి - 200 గ్రాములు
నెయ్యి - 200 గ్రాములు
గుడ్లు - నాలుగు
బేకింగ్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్
వెనీల టేబు - 1 టేబుల్ స్పూన
ఐసింగ్ కోసం - వెన్న 100 గ్రాములు, ఐసింగ్ సుగర్ 200 గ్రాములు
తయారు చేయు విధానం:
1. మైదాపిండి జల్లించండి. ఈ పిండిని ఓ గిన్నెలోని తీసుకుని అందులో గుడ్లు, పంచదార, వెన్న, బేకింగ్ పౌడర్, ఎసెన్స్ వేయండి. వీటన్నింటినీ చేత్తో బాగా కలపాలి.
2. ఓ వెడల్పున్న గుండ్రని గిన్నెలు రెండు తీసుకోవాలి. వాటికి నూనె కానీ, నెయ్యి కానీ రాసి ఈ మిశ్రమాన్ని వాటిల్లో వేసి బేక్ చేయండి.
3. కేకులు తయారయ్యాయా? వాటిని కాస్త చల్లారనివ్వాలి. ఒక కేకును ముఖంలా వాడుకోవచ్చు. మరో కేకును తీసుకొని ఫోటోలో చూపినట్లు చెవులు, కాలర్ ఆకారంలో నిదానంగా కట్ చేయండి. చెవుల కోసం కత్తించి పెట్టుకున్న కేకును కింది భాగంలో కాస్త కట్ చేస్తే సరైన ఆకారం వస్తుంది. వీటిని పైభాగంలో, కాలర్ ముఖానికి కింది భాగంలో పెట్టాలి. ఫోటోలో చూస్తున్నారుగా.. అలాగే రావాలి. ఐసింగ్ చేయడానికి బన్నీ కేక్ సిద్ధం!
4. ఇప్పుడు ఓ గిన్నెలో బట్టర్ తీసుకుని బాగా గిలకొట్టాలి. ఇప్పుడు దీనికి కొద్దికొద్దిగా ఐసింగ్ సుగర్ చేర్చుతూ నిదానంగా కలపాలి. ఈ మిశ్రమానికి వెనీలా ఎసెన్స్ చేర్చాలి.
5. ఐసింగ్ గట్టిగా అయితే కొద్దిగా పాలు కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూడు చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకోండి. వాటిని గులాబీ, నీలి, ఎరుపు, మీకిష్టమైన రంగులు కలపుకోవచ్చు.
6. ముందే సిద్ధం చేసి పెట్టుకున్న కేక్ మీద ఐసింగ్ ను సమాంతరంగా పరవాలి. ఐసింగ్‌బ్యాగ్ సాయంతో ఔట్‌లైన్, కళ్లు, ముక్కు, నోరు గీసేయాలి. అంతే చూడచక్కని బన్నీకేక్ రెడీ!



Click it and Unblock the Notifications