Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఆపిల్ హనీకేక్ రిసిపి: క్రిస్మస్ స్పెషల్
క్రిస్‌మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది క్రిస్‌మస్ ట్రీ. పిల్లలకయితే క్రిస్‌మస్ తాత గుర్తుకువస్తాడు. ఇంకా ఏం గుర్తుకువస్తాయి అని అడిగితే...ప్రశ్న పూర్తవకుండానే జవాబు వచ్చేస్తుంది. నోరూరించే కేకులని. ఒకటి రెండూ కాదు ఆ సమయంలో బోలెడు రకాల కేకులు కెవ్వుమని కేక వేస్తాయి. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా చాకులతో రెడీ అయిపోతారు.
క్రిస్‌మస్‌ని కేకుతో ఆహ్వానిస్తారు. తియ్యగా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సమయం. క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్న వారికి సైతం ఆర్డర్ చేసి మరీ అందచేస్తారు. కొందరు మాత్రం ఇంట్లో చేసుకోవాలనుకుంటారు. అందుకే ఇక్కడ మీకోసం ఒక కేక్ రిసిపిని తయారుచేసే విధానంతో అంధిస్తున్నాం. ఈ స్పెషల్ హనీ ఆపిల్ కేక్ రిసిపిని మీరు కూడా ప్రయత్నించి మీ క్రియేటివిటీని జోడించి డెకొరేట్ చేయండి...కేక్ కట్ చేసి ఇంటికి వచ్చిన అతిథులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తీయగా అందించండి...

కావల్సిన పదార్థాలు:
ఆపిల్స్ - 2 cups (సన్నగా ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
గుడ్లు - 3
బట్టర్ - 1 cup
షుగర్ - 1 cup
మైదా - 1cup (unsalted)
వెనీలా ఎసెన్స్ - 3 to 4 drops
తేనె- 4 tbsp
బేకింగ్ సోడా - 1/2 tsp
బాదం పౌడర్ - 1 cup
బెస్ట్ కేక్ రిసిపిలు క్రిస్మస్ స్పెషల్
తయారుచేయు విధానం:
1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పంచదార, గుడ్లు, బట్టర్, వెనీలా ఎసెన్స్ మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
2. ఇప్పుడు అందులోనే మైదా, బాదం పౌడర్, తేనె మరియు బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి.
3. అంతలోపు ఆపిల్ ను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
4. తర్వాత మందపాటి పాన్ తీసుకొని అందులో బటర్ రాసిపెట్టాలి.
5. ఇపుడు అందులో ముందుగా కలిపి పెట్టుకొన్న మిశ్రమాన్ని పోయాలి.
6. ప్రెజర్ కుక్కర్లో నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి మందపాటి పాన్ ను అందులో ప్లేస్ చేయాలి. అరగంట మీడియం మంట మీద రెండు మూడు, విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
7. ఓవెన్లో పెట్టేట్లైతే 40నిముషాలు 350డిగ్రీల వద్ద ప్రీహీట్ చేసుకోవాలి.
8. ఈ రెండు పద్దతుల్లో ఏదో ఒక పద్దతిని ఉపయోగించ హనీ ఆపిల్ కేక్ ను తయారుచేసుకోవచ్చు. అంతే టేస్టీ అండ్ స్పెషల్ క్రిస్మస్ కేక్ రిసిపి రెడీ.



Click it and Unblock the Notifications