కార్న్(మొక్కజొన్న) సలాడ్

Corn Salad
కావలసిన వస్తువులు:

ఉడికించిన కార్న్: 1cup
ఉడికించిన బంగాళదుంప : 1
టమాట: 1
ఉల్లిపాయ: 1
కొత్తిమిర: 2 tsp
నిమ్మరసం: 1/2
ఉప్పు: చిటికెడు
చాట్ మసాలా పొడి:1/4 tsp
క్యారట్ తురుము: 3 tsp

1. ఒక వెడల్పాటి గిన్నెలో ఉడికించిన మొక్కజొన్న గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేయాలి.
2. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉడికించిన బంగాళదుంప, క్యారట్ తురుము, నిమ్మరసం, వేసి అన్నింటిని బాగా కలియబెట్టాటి.
3. ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమిర, ఉప్పు, చాట్ మసాలా పొడి వేసి బాగా కలియబెట్టాలి. ఈ సలాడ్ ని కాస్త చల్లబరచి తింటే ఇంకా రుచిగా ఉంటుంది.

Story first published: Tuesday, March 1, 2011, 14:41 [IST]
Desktop Bottom Promotion