Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
సోయా బీన్ పకోడా-హెల్తీ ఈవెనింగ్ స్నాక్
పకోడా టేస్టీ ఫ్రైడ్ స్నాక్. ముఖ్యంగా ఇండియాలో ఫేమస్ ఈవెనింగ్ స్నాక్స్. ఈ ఫేమస్ ఈవెనింగ్ స్నాక్ ను ఒక కప్పు కాఫీతో ఎంజాయ్ చేస్తారు. పకోడాలను ఇంట్లోనో లేదా స్ట్రీట్ స్టాల్స్ లోనో తయారుచేసి ఒక కప్పు మసాలా ఛాయ్ తో పాటు హాట్ హాట్ గా సర్వ్ చేస్తారు. పకోడాలో వెజిటేబుల్ పకోడా, ప్లెయిన్ పకోడా లేదా వివిధ రకాల పదార్థాలు, చికెన్, ఖీమా, పనీర్ వంటి ఉపయోగించి తయారుచేస్తుంటారు.
సోయా బీన్ హెల్తీ డైట్ ఫుడ్. ఇందులో అనేక ప్రయోజనాలున్నాయి. ఈ లెగ్యుమ్ జాతికి చెందిన గింజల్లో ప్రోటీనులు, న్యూట్రీషియన్స్ మరియు వివిధ రకాల విటమిన్స్ శరీరానికి అవసరం అయ్యేవి ఇందులో పుష్కలంగా ఉన్నాయి . ఇది క్యాన్సర్ ను నివారిస్తుంది . హార్ట్ కు రక్షణ కల్పిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఎముకలను ఆరోగ్యంగా ఉంచతుంది . కొన్ని సందర్భాల్లో ఈ సోయా బీన్స్ తో హెల్తీ ఈవెనింగ్ స్నాక్ ను తాయరుచేయవచ్చు. మరి ఈ హెల్తీ ఈవెనింగ్ స్నాక్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
సోయా బీన్: 100grms
ఉల్లిపాయలు: 2(సన్నగా తరగాలి)
బంగాళదుంప: 3(బాగా ఉడికించి తర్వాత చిదిమి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 3(సన్నగా కట్ చేసుకోవాలి)
శెనగపప్పు: 2cups
కారం: 1tsp
సోంపు: 1tsp
ధనియాలు: 1tsp
నల్ల నువ్వులు: 1/2tsp
బేకింగ్ సోడా : చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 1cup
నూనె: 2cups
తయారుచేయు విధానం:
1. ముందుగా సోయాబీన్స్ ను వేడి నీటిలో వేసి 10నిముషాలు నానబెట్టుకోవాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపప్పు, సోంపు, కారం, ఉప్పు, నువ్వులు, బేకింగ్ సోడా, ధనియాలు వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు అందులోనే వేడి నీటిలో నానబెట్టుకొన్న సోయా బీన్స్, పచ్చిమిర్చి మరియు ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప వేయాలి. స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా నీళ్ళు పోసి, సెమీ లిక్విడ్ పేస్ట్ లా కలుపుకోవాలి.
4. తర్వాత డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో సోయా మిశ్రమాన్ని చేత్తో తీసుకొని పకోడల్లా బాల్స్ గా వేయాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి . ఇవి బ్రౌన్ కలర్ లో క్రిస్పీగా అయ్యే వరకూ ఫ్రై చేసుకోవాలి. అంతే సోయా బీన్ పకోర రెడీ. వీటిని కొత్తిమీర చట్నీ మరియు టమోటో సాస్ తో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications