Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు!
క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ పకోడా
మాసాంహార ప్రియులకు ఓ మంచి టేస్టీ స్నాక్ చికెన్ పకోడా. ఈ చికెన్ పకోడా వంటకాన్ని తయారు చేయడం చాలా సులభం మరియు అతి తక్కువ వస్తువులతోనే అద్భుతమైన రుచిని అందిస్తుంది. చికెన్ పకోడాను కొన్ని ఇండియన్ మసాలా దినుసులతో తయారు చేసి పేస్ట్ ను కలపడం వల్ల, మొక్కజొన్న పిండి కలపడం వల్ల మంచి ఫేవర్ తో రంగు రుచితో నోరూరిస్తుంటుంది. ఇక్క బ్రెడ్ పొడి ఉపయోగిండం వల్ల క్రిస్పీగా తయారవుతుంది.
ఇలాంటి వంటని ఓ సాయంత్రంలో మీ కుటుంబ సభ్యలుకు రుచి చూపించండి. మరి ఆ టేస్ట్ ఎప్పటికీ మరిచిపోలేరు. మరి ఇంకెందు కాలస్యం రండి ఎలా తయారు చేయాలో.. అందుకు ఏఏ వస్తువులు కావాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్: 300grms
ఉల్లిపాయలు: 2
వెల్లుల్లి రెబ్బలు: 6
అల్లం : చిన్నముక్క
పచ్చిమిర్చి: 4
గరం మసాలా: 2tsp
కార్నప్లోర్(మొక్కజొన్న పిండి): 4tsp
బ్రెడ్ ముక్కలు(బ్రెడ్ ను పొడిగా చేసుకోవాలి): 4tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సీలో చికెన్ వేసి మెత్తగా చేసి ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్ లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని చికెన్ లో కలపుకొని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు అందులో తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు మరియు గరం మసాలా జోడించాలి. కొద్దిగా నీరు కూడా చేర్చి మొక్కజొన్న పిండి కూడా వేసి బాగా కలగలుపుకోవాలి. మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని కొంచెం చిక్కగా కలుపుకోవాలి.
3. తర్వాత ఈ మొక్కజొన్న పిండి మిశ్రమంలో చికెన్ మిశ్రమాన్ని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొవాలి. ఒక్కో ఉండని అరచేతిలో పెట్టుకొని వడలాగ తట్టుకోవాలి. వడలాగ తట్టుకొన్ని చికెన్ మిశ్రమాన్ని బ్రెడ్ పొడి రెండు వైపులా అద్దాలి.
4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక అందులో ఈ చికెన్ వడలు లేదా బాల్స్ గా అలాగే వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పేపర్ మీద వేస్తే నూనె పీల్చుకుంటుంది. తర్వాత టమోటో సాస్, క్యారెట్, ఉల్లిపాయ తురుముతో సర్వ్ చేయాలి. అంతే క్రిస్పీ చికెన్ పకోడా రెడీ...



Click it and Unblock the Notifications