ఎగ్ వైట్ మష్రుమ్ ఆమ్లెట్: హెల్తీ ఈవెనింగ్ స్నాక్

అదేంటంటే, ఆలూ ఆమ్లెట్. సాధారణంగా ఆమ్లెట్ ను చాలా రకాలుగా వండుతారు. చాలా ఆకలిగా ఉన్నప్పుడు చిటికెలో తయారు చేసుకొని తినగలిగే అల్పాహారం ఎగ్ ఆమ్లెట్. డైయట్ ను పాటించే వాళ్ళు పచ్చసొన ఫాట్, కొలెస్ట్రాల్ శాతం అధికం అనుకొనే వాళ్ళు ఎగ్ వైట్ తో ఆమ్లెట్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యం.

అయితే మరింత టేస్టీగా మరిన్ని పోషకాలు, క్యాలరీలు శరీరానికి అందివ్వాలంటే అందులో ఆలూ కూడా జత చేసి ఆమ్లెట్ తయారు చేసుకొని తినొచ్చు. ఇది పిల్లలకూ పెద్దలకూ మంచి పౌష్టికాహారం.

తక్కువ టైమ్‌లోనే తయారు చేసుకునే స్నాక్స్‌ అయ్యుండాలి. కాబట్టి పుట్టగొడుగులు, గుడ్డులోని తెల్లసొనలతో కలిపి చక్కటి ఆమ్లెట్‌ వేసుకోండి. తక్కువ క్యాలరీలతో ఎక్కువ శక్తినిచ్చే స్నాక్‌ ఇది. అల్పాహారం. మరి ఈ స్పెషల్ సైడ్ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Egg white with Mushroom Omelette: Telugu Vantalu

కావల్సిన పదార్థాలు:
మష్రుమ్(పుట్టగొడుగులు): 1cup(మష్రుమ్ ను తరుముకోవాలి. లేదా సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఎగ్ వైట్: 4
పెప్పర్: 1/2tsp
పాలు: 1tbps
ఆలివ్ ఆయిల్: 1tsp
ఓరిగానో: 1/2tsp
చీజ్: 1/2cube(గార్నిష్ కొరకు)
కొత్తిమర: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగులగొట్టి అందులోని తెల్ల సొనని మాత్రమే బౌల్లోనికి జాగ్రత్తగా వంచుకోవాలి.
2. ఇప్పుడు ఎగ్ వైట్ కు పాలు కలిపి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకొన్న మష్రుమ్, కొత్తిమీ, అన్ని వేసి బాగా గిలకొట్టాలి.
3. అలాగే అందులో పెప్పర్ అప్పుడే వేయవచ్చు లేదా తర్వాత కూడా పెప్పర్ ను చిలకరించుకోవచ్చు.
4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి.
6. ఇప్పుడు మష్రుమ్ ఎగ్ వైట్ మిక్స్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని పాన్ మీద పోయాలి.
7. ఈ ఆమ్లెట్ ను రెండు వైపులా కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. ఇప్పుడు దానికి పెప్పర్ పౌడర్, ఓరిగానో చిలకరించాలి. మీరు ఇంకా దానీ మీద చీజ్ తురుమును కూడా చిలకరించాలి.
9. చివరగా కొత్తిమీర తరుగు గార్నిష్ చేయాలి. అంతే ఎగ్ వైట్ మష్రుమ్ మీల్ ఆమ్లెట్ రెడీ. ఇది హెల్తీ ఈవెనింగ్ స్నాక్ రిసిపి

Story first published: Monday, July 27, 2015, 16:01 [IST]
Desktop Bottom Promotion